AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Jagadish Reddy: కృష్ణా నీటి దోపిడీలో తండ్రిని మించిపోతున్న జగన్.. చట్టపరంగానే జల విద్యుత్ ఉత్పత్తిః మంత్రి జగదీష్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిపోయి దుర్మార్గానికి పాల్పడుతున్నారని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు.

Minister Jagadish Reddy: కృష్ణా నీటి దోపిడీలో తండ్రిని మించిపోతున్న జగన్.. చట్టపరంగానే జల విద్యుత్ ఉత్పత్తిః మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadishreddy
Balaraju Goud
|

Updated on: Jul 02, 2021 | 1:43 PM

Share

Minister Jagadish Reddy on AP CM Jagan letter: కృష్ణా జలవివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. జల విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి ఏకంగా కేంద్రానికే లేఖ రాశారు. దీంతో తెలంగాణ నేతలు మరోసారి భగ్గుమంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిపోయి దుర్మార్గానికి పాల్పడుతున్నారని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. దొంగే దొంగ అన్నట్లు జగన్‌ ప్రధాని మోదీకి లేఖ రాశారని వ్యాఖ్యానించారు. నీటి సమస్యను తెచ్చిందే ఏపీ ప్రభుత్వమని, విద్యుత్‌ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని మంత్రి జగదీష్‌రెడ్డి తేల్చి చెప్పారు.తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని పరిష్కరించుకోవాలన్న చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్రానికి లేఖ రాసే పరిస్థితి తెచ్చుకుందని ధ్వజమెత్తారు. సమస్య సృష్టించి పరిష్కారం చేయమని అడగడం ప్రజలను మోసం చేయడమే అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్నేహ హస్తాన్ని మరచి ఏపీ సీఎం జగన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కృష్ణా నది నీళ్ల దోపిడి విషయంలో తండ్రిని మించిపోతున్నాడని ఆరోపించారు. ఏపీ తీరును నిరసిస్తూ.. తప్పని పరిస్థిహుల్లో కోర్టుకు వెళ్లినా.. కోర్టుని సైతం వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ నీటి అవసరాలకు మాజీ సీఎం వైఎస్ఆర్ ఒక్క జీవో ఇవ్వలేదన్న మంత్రి.. పాత పద్దతిలో జగన్ కూడా దుర్మార్గం చేస్తే సహించబోమన్నారు. కూర్చొని మాట్లాడుకుందామని కేసీఆర్ చెప్పినా వినకుండా మూర్ఖంగా వెళ్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ బతికున్నంత కాలం తెలంగాణ హక్కులను ఎవ్వరూ హరించలేరని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణకు రావల్సిన ప్రతి నీటి బొట్టును కాపాడుకుంటామన్న మంత్రి.. చట్టపరంగా ఉన్న హక్కులతోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. కృష్ణా నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలన్నారు. రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు వెడల్పు జీవోలను ఉపసంహరించుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడానికే కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నారన్నారు. జగన్ ఉత్తరాలు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ఉంది.

Read Also….  Danam Nagender: చివరి శ్వాస వరకు కేసీఆర్ కేటీఆర్ తోనే.. తప్పుడు ప్రచారం చేస్తే పుట్టగతులు ఉండవుః దానం నాగేందర్