Telangana: ‘నా మాటలను వక్రీకరించారు’.. దళితబంధుపై కామెంట్స్‌కు వివరణ ఇచ్చిన మంత్రి ఐకేఆర్..

దళితబంధు పథకం తమ ఇష్టం వచ్చినవారికి ఇస్తామంటూ చేసిన కామెంట్స్‌పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న..

Telangana: ‘నా మాటలను వక్రీకరించారు’.. దళితబంధుపై కామెంట్స్‌కు వివరణ ఇచ్చిన మంత్రి ఐకేఆర్..
Minister Indrakaran Reddy
Follow us

|

Updated on: Sep 28, 2022 | 10:16 AM

దళితబంధు పథకం తమ ఇష్టం వచ్చినవారికి ఇస్తామంటూ చేసిన కామెంట్స్‌పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తన కామెంట్స్‌కు వివరణ ఇచ్చుకున్నారు. దళితబంధు పథకం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వకరీకరించారని ఆరోపించారు. ఓపిక ఉండాలని మాత్రమే అన్నానని, కావాలని రచ్చ చేస్తుండటంతో సముదాయించే ప్రయత్నం చేశానని వివరించారు మంత్రి ఐకేఆర్. బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించిన ఆయన.. దళితబంధు ఎస్సీల బతుకులు మార్చే పథకం అన్నారు. ఈ పథకం వల్ల సీఎం కేసీఆర్‌కు ప్రజాధరణ పెరుగుతుందని, ఆ అక్కసుతోనే దళతబంధు పంపిణీపై ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నాయని విమర్శించారు మంత్రి ఐకేఆర్. ఇదే విషయాన్ని మొన్నటి సభలో ప్రస్తావించగా.. తన మాటలను వక్రీకరించారని దుయ్యబట్టారు. ఈ పథకానికి బీజేపీ ఒక్క పైసా ఇవ్వలేదని స్పష్టం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. కానీ, బీజేపీ నేతలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ రచ్చ చేస్తున్నారని, వివాదాలు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి ఐకేఆర్.

ఇదిలాఉంటే.. ఇటీవల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర అసహనంతో ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ -జి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీకై వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. అక్కడ దళిత బంధు గురించి ఓ మహిళల ప్రశ్నించగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ‘‘మీకు ఓపిక లేకుంటే మేం ఏం చేయాలి. మా ఇష్టమొచ్చిన వాళ్లకు ఇచ్చుకుంటాం. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు’’ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అంతేకాదు.. రూ. 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావో చెప్పాలని ప్రశ్నించారు. ‘మీకు అనుభవం ఏం ఉంది.. ఏం చేసుకుని బతుకుతావో చెబితేనే దళిత బంధు ఇస్తాం’ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇస్తున్న డబ్బు తెలంగాణ డబ్బని, ఇందులో కేంద్రానికి పైసా లేదన్నారు. కావాలంటే కేంద్రం దగ్గరకే వెళ్లి తెచ్చుకో అన్నారు మంత్రి ఇంద్రకరణ్‌. ఎవరి వెనకాల తిరుగుతున్నారో వాళ్లనే అడగాలన్నారు.

ఈ కామెంట్స్ రాజకీయంగా పెనుదుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉందికదా అని ఎలా పడితే వ్యవహరించడం సరికాదని ఫైర్ అవుతున్నారు. మరోవైపు విపక్షాలు సైతం మంత్రి కామెంట్స్‌పై సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే దళితబంధు పథకాన్ని అర్హులైనవారికంటే.. అనుయాయులకే ఇస్తున్నట్లుగా అర్థమవుతోందంటున్నారు విపక్ష నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..