Bengaluru Techie Startup: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.. సంచలనంగా మారిన పోర్టల్..

Bengaluru Techie Startup: మనీ.. మనీ.. మనీ.. ఏ అవసరమైనా మనీ ఉంటే చాలు. ఇట్టే నెరవేరుతుంది. వస్తువుల కొనుగోళ్లే కాదు.. ఆఖరికి బంధాలు సైతం..

Bengaluru Techie Startup: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.. సంచలనంగా మారిన పోర్టల్..
Toyboy
Follow us

|

Updated on: Sep 27, 2022 | 11:55 AM

Bengaluru Techie Startup: మనీ.. మనీ.. మనీ.. ఏ అవసరమైనా మనీ ఉంటే చాలు. ఇట్టే నెరవేరుతుంది. వస్తువుల కొనుగోళ్లే కాదు.. ఆఖరికి బంధాలు సైతం మనీతో వచ్చేస్తున్నాయి. అవును, గంటల లెక్కన గదులు రెంట్ తీసుకోవడం చూశాం.. వాహనాలు రెంట్ తీసుకోవడం చూశాం.. వస్తువులు రెంట్ తీసుకోవడం చూశాం.. మరి బంధుత్వాన్ని రెంట్ తీసుకోవడం ఎప్పుడైనా చూశారా? తెలియకపోతే, ఇప్పుడు తెలుసుకోండి. అవును, చివరికి బంధుత్వాలు సైతం పైసలకు దొరుకుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన కొందరు టెకీలు సరికొత్త స్టార్టప్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా గంటకు ఇంత మొత్తం లెక్కన బాయ్‌ ఫ్రెండ్‌లను కిరాయికి ఇస్తారు. ఈ మేరకు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు టెకీలు. ఇప్పుడిది కన్నడనాట సంచలనంగా మారింది.

ప్రియుడు వంచించాడనో, ప్రేమ విఫలమైందనో, నిజమైన ప్రేమ దక్కలేదనో బాధపడే యువతుల కోసం ఈ పోర్టల్‌ను మొదలు పెట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ‘టాయ్ బాయ్’ పేరిట స్టార్ట్ చేసిన ఈ పోర్టల్ ద్వారా డిప్రెషన్‌కు లోనయ్యే వారు, తమ బాధను పంచుకోవడం ద్వారా రిలాక్స్ అవ్వొచ్చంటున్నారు. ఈ పోర్టల్ ద్వారా తమకు కావాల్సిన వారితో కాంటాక్ట్ అవ్వొచ్చని తెలిపారు. అయితే, ఈ ఫోర్టల్ ద్వారా ‘బాయ్’ ఎవరి వద్దకూ భౌతికంగా వెళ్లరని, ఫోన్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవుతారని వివరించారు పోర్టల్ ప్రారంభించిన కౌశల్ ప్రకాశ్. ఫోన్ ద్వారా తమ తమ బాధలను, సమస్యలను పంచుకుని, మానసిక ఆందోళన, ఒత్తిడి నుంచి దూరం అయ్యేందుకు సహకరిస్తారని తెలిపారు. ఈ సేవలు పోర్టల్‌తో పాటు, యాప్‌లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. ఆర్ఏబీఎఫ్ అనే యాప్ ద్వారా బాయ్ ఫ్రెండ్‌ను పొందవచ్చు అని వివరించారు. ఎవరికైనా బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటే.. నిర్ణీత డబ్బు చెల్లించి, వారి సేవలను వినియోగించుకోవచ్చునని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఈ పోర్టల్ ఇప్పుడు కన్నడనాట సంచలనంగా మారింది. కేవలం యువతులను ఉద్దేశించి ఈ పోర్టల్ రూపొందించడం, అద్దెకు అబ్బాయిలను ఇస్తామనడం విదాస్పదంగా మారింది. ఇప్పటికే దీనిపై చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి అక్కడి ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..