AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Errabelli Dayakar Rao: తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబరాలు.. వైరల్‌గా మంత్రి ఎర్రబెల్లి కోలాట నృత్యం

తెలంగాణలో ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ జోరుగా సాగుతోంది. చీరల పంపిణిలో మంత్రి ఎర్రబెల్లి.. కోలాటం ఆడి, స్టేపులు వేసి ఊత్సాహాపరిచారు.

Errabelli Dayakar Rao: తెలంగాణలో మొదలైన బతుకమ్మ సంబరాలు.. వైరల్‌గా మంత్రి ఎర్రబెల్లి కోలాట నృత్యం
Errabelli Dance
Ram Naramaneni
|

Updated on: Oct 03, 2021 | 5:16 PM

Share

తెలంగాణలో బతుకమ్మ సందడి షూరు అయ్యింది. ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ జోరుగా సాగుతోంది. చీరల పంపిణిలో మంత్రి ఎర్రబెల్లి.. కోలాటం ఆడి, స్టేపులు వేసి ఊత్సాహాపరిచారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఘనంగా బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం మొదలైంది. కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కోలాటం ఆడారు. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఈసారీ మల్టీపుల్ కలర్స్ లో చీరల పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలు సంతోషంగా బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా వేడుకలా జరపాలని, ఆడబిడ్డలకు చీరెలను పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలను గౌరవించుకుంటూ పుట్టింటి సారెగా రూ 333.14 కోట్లతో బతుకమ్మ చీరలను రాష్ట్రంలోని ప్రతి మహిళకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కులవృత్తులను ప్రోత్సహించాలని, చేనేత పరిశ్రమకు చేయూత అందివ్వాలనే లక్ష్యంతో బతుకమ్మ చీరల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. కల్యాణ లక్ష్మి చెక్కులను కూడా మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.

అనంతరం వెలికట్టలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మినిస్టర్ మహిళలకు చీరలను, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను, స్వయం సహాయక మహిళలకు 7 కోట్ల రూపాయల లోన్స్ పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ సీఈఓ రమాదేవి.. స్థానిన నాయకులు పాల్గొన్నారు.

Also Read:

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..