New Year 2023: మందుబాబులకు గుడ్ న్యూస్.. అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలు
ఇక డిసెంబర్ 31 రాబోతోంది. 2022 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2023 సంవత్సరానికి స్వాగతం పలుకనున్నారు. దీంతో డిసెంబర్ 31న ఈ ఏడాదికి వీడ్కోలు చెబుతూ జోరగా పార్టీలు చేసుకుంటారు..

ఇక డిసెంబర్ 31 రాబోతోంది. 2022 సంవత్సరానికి వీడ్కోలు పలికి 2023 సంవత్సరానికి స్వాగతం పలుకనున్నారు. దీంతో డిసెంబర్ 31న ఈ ఏడాదికి వీడ్కోలు చెబుతూ జోరగా పార్టీలు చేసుకుంటారు. దీంతో పెద్ద ఎత్తున మద్యం ఎరులై పారుతుంది. పార్టీలు, డ్యాన్స్‌లతో అర్థరాత్రి వరకు హోరెత్తిపోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్‌న్యూస్ తెలిపింది. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల సమయ వేళలను మార్చింది. డిసెంబరు 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. ఇక బార్ అండ్ రెస్టారెంట్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అలాగే రిటైల్ షాపుల్లో మద్యం అమ్మకాలకు ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండగా, 31న ఒక గంట పాటు పెంచుతూ రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు మూసి ఉండనున్నాయి. ప్రస్తుతం రాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచే బార్లు డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట వరకు తెరచుకోవచ్చని తెలిపింది.
పోలీసుల నిబంధనలు:
మరోవైపు కొత్త సంవత్సర వేడులక సందర్భంగా పోలీసులు కొత్త నిబంధనలు విధించారు. త్రీస్టార్, అపై ఉన్న హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల వద్ద ప్రవేశ ద్వారాలు, పార్కింగ్ స్థలాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు, అసభ్యకార్యక్రమాలు, అలాగే అధిక శబ్దంతో డీజేలు ఉండకూడదని, 45 డెసిబెల్స్ మించకూడదని పోలీసులు నిబంధనలు విధించారు. బార్లలో మైనర్లకు అనుమతించకూడదని, ఏవైనా గొడవలు జరిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి