AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime Rate: తెలంగాణలో పెరిగిన క్రైమ్‌ రేట్‌.. గతేడాదితో పోలిస్తే ఎంత పెరిగిందంటే..?

తెలంగాణలో గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 2021తో పోలిస్తే 2022లో 4.44 శాతం క్రైం రేట్‌ పెరిగినట్లు డీజీపీ వెల్లడించారు.

Telangana Crime Rate: తెలంగాణలో పెరిగిన క్రైమ్‌ రేట్‌.. గతేడాదితో పోలిస్తే ఎంత పెరిగిందంటే..?
Telangana Crime Rate
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 29, 2022 | 4:58 PM

తెలంగాణలో గతేడాదితో పోలిస్తే క్రైమ్ రేట్ పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 2021తో పోలిస్తే 2022లో 4.44 శాతం క్రైం రేట్‌ పెరిగినట్లు డీజీపీ వెల్లడించారు. సైబర్ క్రైమ్ కేసులు 57 శాతం పెరిగినట్లు తెలిపారు. 2022 లో రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎన్‌కౌంటర్లు జరగాయని, ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారని తెలిపారు. 120 మంది మావోయిస్టులు లొంగిపోగా, వారి నుంచి 14 ఆయుధాలు, 12 లక్షల 65 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి వివరించారు. ఈ మేరకు మహేందర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు.

‘‘కన్విక్షన్ రేట్ 50 నుండి 56 శాతానికి పెరిగింది. 152 మందికి జీవితకాలం శిక్ష పడింది. సీసీ కెమెరాలు ద్వారా 18,234 కేసులు ఛేదించాం. 431 మంది పై పీడీ యాక్ట్ పెట్టి జైలు పంపించాం. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్కి 6,157 ఫిర్యాదులు వచ్చాయి.. వీటిలో 2,128 కేసులు నమోదు చేశాం. డయల్ 100 కి 13 లక్షల 77 వేళా 113 కాల్స్ వచ్చాయి. ఫింగర్ ప్రింట్స్ ద్వారా 420 కేసులను ఛేదించాం’’ అని పేర్కొన్నారు.

ఈ ఏడాది 762 హత్యకేసులు నమోదయ్యాయి. 2,126 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 1176 డ్రగ్ కేసులు నమోదవ్వగా 2582 నిందితులను అరెస్ట్ చేశాం. మహిళలపై క్రైమ్ కేసులు 17,908 నమోదయ్యాయి. 2432 పొక్సో కేసులు నమోదు. 2022లో 24,127 దోపిడీ కేసులు నమోదయ్యాయి. 148 కోట్ల దోపిడీ జరగగా 74 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది 19,456 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 6,746 మంది ప్రాణాలు కోల్పోయారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఒక కోటి 65 లక్షల 84 వేల కేసులు నమోదు చేశాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 612 కోట్ల రూపాయల జరిమానాలు విధించినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 25 వేల సీసీ కెమెరాలున్నాయి. ఈ సంవత్సరం లక్షా 75 వేల కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని.. క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషిచేస్తున్నామని డీజీపీ వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..