Bio Asia Summit 2022: బయో ఏసియా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. కీలక ప్రసంగం చేసిన మంత్రి..
Bio Asia Summit 2022: ఆసియాలోనే అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్‌కేర్ ఫోరం బయో ఏషియా సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
Bio Asia Summit 2022: ఆసియాలోనే అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్‌కేర్ ఫోరం బయో ఏషియా సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ఈ సదస్సుల్లో పాల్గొన్న బిల్‌గేట్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నారు మంత్రి కేటీఆర్. కరోనా మహమ్మారితో రెండేళ్లుగా యావత్ ప్రపంచం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కరోనా నేర్పిన పాఠాలు, అనుభవాలు, ఆరోగ్య పరిరక్షణలో కొత్త పోకడల వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. అలాంటి అంశాలపైనే బిల్‌గేట్స్‌తో చర్చించారు మంత్రి కేటీఆర్. బయో ఆసియా-2022 అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. వర్చువల్‌గా జరిగిన ఈ సదస్సులో బిల్‌గేట్స్ పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ సిటీ కీలకంగా నిలిచిందని చెప్పారు మంత్రి కేటీఆర్. గతంలో ఉన్న తెలంగాణ వేరు, ప్రస్తుతం తెలంగాణ వేరని వివరించారు. బిల్‌గేట్స్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించారు మంత్రి కేటీఆర్.
కరోనా సమయంలో భారత్ త్వరగా స్పందించిందన్నారు బిల్‌గేట్స్. భారత కంపెనీలు వ్యాక్సిన్లు త్వరగా తయారు చేశాయని అభినందించారు. కరోనా వ్యాక్సిన్ ధర కూడా అందరికీ అందుబాటులో ఉందన్నారు. భవిష్యత్తులో అనేక వైరస్‌లు దాడి చేయవచ్చని, కరోనా అనేక దేశాలకు పెను సవాళ్లు విసిరిందన్నారు బిల్‌గేట్స్. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? కరోనా లాంటి వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసకుంటారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించగా, ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని బదులిచ్చారు బిల్‌గేట్స్.
Also read:
MLA vs Public: వద్దు.. రావొద్దు..! ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన జనాలు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Andhra Pradesh: ఇద్దరు యువతుల రచ్చ.. ప్రేమ, పెళ్ళి, స్నేహం ఏది నిజం.. తలపట్టుకుంటున్న పోలీసులు..!