Cm Kcr Delhi Tour: ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌.. ఆయనను కలిసేందుకే వెళ్తున్నారా?..

Cm Kcr Delhi: జాతీయ రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌గా మారారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. నేషనల్ పాలిటిక్స్‌లో తనదైన ముద్ర వేసే ఆలోచనలు చేస్తున్నారు సీఎం.

Cm Kcr Delhi Tour: ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్‌.. ఆయనను కలిసేందుకే వెళ్తున్నారా?..
Cm Kcr
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 25, 2022 | 6:04 AM

Cm Kcr Delhi: జాతీయ రాజకీయాల్లో టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌గా మారారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. నేషనల్ పాలిటిక్స్‌లో తనదైన ముద్ర వేసే ఆలోచనలు చేస్తున్నారు సీఎం. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ఢిల్లీకి పయనమవుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన కేసీఆర్, తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రిగా ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు మరోసారి దేశాన్ని బాగు చేసేందుకు జాతీయ రాజకీయాల్లోకి వెళుతానని పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుండటంతో, ఆ పార్టీకి జాతీయస్థాయిలో చెక్ చెప్పాలని భావిస్తున్నారు సీఎం. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ద్వారా ఇక్కడ తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయొచ్చనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలె ముంబై వెళ్లి ఉద్ధవ్, శరద్ పవార్​లను కలిశారు కేసీఆర్.

ఇవాళ కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతల్ని కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారాయన. దీనిపై చర్చలు జరిపేందుకే ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు టీఆర్​ఎస్​ ఎంపీలు, కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో నిర్మాణం అవుతున్న పార్టీ ఆఫీసును కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది. ఇటీవల కేసీఆర్ ఢిల్లీకి వెళ్లినా, ఎవరెవర్ని కలిశారో స్పష్టత లేదు. ప్రశాంత్ కిషోర్‌ను కలిసినట్లుగా ప్రచారం జరిగింది. ఈసారి ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు ప్రశాంత్ కిషోర్‌తోనూ సమావేశం అవుతారని తెలుస్తోంది. త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రాంతీయ పార్టీలన్నీ కలిపి ప్రత్యేకంగా ఓ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాయని సమాచారం. ఈ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌ను అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ రాష్ట్రపతి ఎన్నికలు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయాడానికి ఓ అవకాశం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also read:

Russia Ukraine Crisis: రష్యా దాడులపై అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ..

Russia Ukraine Crisis: పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..

Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..