Telangana: దసరా, సంక్రాంతి సెలవులు 8 రోజులే.. 2025-26 అకడమిక్ క్యాలెండర్ వచ్చేసిందోచ్
ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్. తెలంగాణ విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. మొత్తం 77 రోజులు సెలవులు ఉండగా.. దసరా పండుగ, సంక్రాంతి పండుగకు చెరో 8 సెలవులు ప్రకటించింది. అలాగే జూన్ 2వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ముగిసి ఫలితాలు ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ అకాడమిక్ కాలెండర్ ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 2 న ఇంటర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఒకే రోజులు కాలేజీలు తెరుచుకుంటాయి. ఇంటర్ కాలేజీలకు 2025-26 విద్యాసంవత్సరంలో దసరా సెలవులను సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది.
నవంబర్ 10 నుంచి నవంబర్ 15 వరకు జూనియర్ కాలేజీల్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 2026 జనవర్ 11 నుంచి జనవరి 18 వరకు సంక్రాంతి హాలీడేస్ ఉన్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్, మార్చి మొదటి వారంలో థీయరి వార్షిక పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ బోర్డు అకడామిక్ కాలేండర్ రూపొందించింది. మార్చి 31, 2026 లాస్ట్ వర్కింగ్ డేగా నిర్ధారించారు. మొత్తం వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ కాలేజీలు 226 రోజులు నడవనున్నాయి. 77 సెలవులు ఆదివారాలను కలుపుకొని రానున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి