TS High Court : 48 గంటల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ నిర్ణయం తీసుకోండి.. లేదంటే మేమే ఆదేశాలిస్తాం..టీ సర్కారుకి హైకోర్ట్ ఆదేశం
TS High Court serious : 48 గంటల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ ఆదేశించింది..
TS High Court serious : 48 గంటల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ ఆదేశించింది. లేకపోతే తామే ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. డీజీపీ, ఆరోగ్యశాఖ అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదిక తప్పులు తడకగా ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతోన్న నేపథ్యంలో GHMC లో నమోదైన కేసులు వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని తెలిపింది. వెబ్ సైట్ లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలని.. Covid ట్రీట్మెంట్ అందించే హాస్పిటల్ వివరాలు వెబ్ సైట్లో పెట్టాలని సూచించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలలో, పబ్లిక్ ప్లేస్ లలో పటిష్టమైన కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని…. అర్టిపిసిఆర్ టెస్ట్ రిపోర్ట్స్ 24 గంటల్లోనే ఇవ్వాలని ఆదేశించింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితుల పైన మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక అందించాలని కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసింది. హైకోర్టులో covid నివారణ పై దాఖలైన పిటిషన్ మీద జరిగిన విచారణ సందర్భంలో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు
కరోనా కట్టడికి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు.. పబ్బులు, మద్యం దుకాణాల ఆంక్షలపై ఆరా..!