Hyderabad police dies : పోలీస్ డిపార్ట్మెంట్‌కి కరోనా కాటు, హైదరాబాద్‌లో కోవిడ్ సోకి ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మృతి

Hyderabad police dies of COVID-19 : రాజధాని నగరం హైద‌రాబాద్‌‌లో క‌రోనాతో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు...

Hyderabad police dies : పోలీస్ డిపార్ట్మెంట్‌కి కరోనా కాటు, హైదరాబాద్‌లో కోవిడ్ సోకి ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మృతి
Follow us
Venkata Narayana

|

Updated on: Apr 19, 2021 | 5:04 PM

Hyderabad police dies of COVID-19 : రాజధాని నగరం హైద‌రాబాద్‌‌లో క‌రోనాతో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. బోయినపల్లిలో పనిచేస్తున్న ఏఎస్ఐ రాధాకృష్ణ కరోనా మహమ్మారికి చిక్కి చనిపోయారు. అటు, డబీర్‌పుర పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్ పని చేస్తున్న జితేందర్ కూడా కరోనాకాటుకు బలైపోయారు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఎఎస్ఐ రాధాకృష్ణ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఏప్రిల్ 8 న ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కాగా, రాధాకృష్ణ ఇతర ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారని తెలిసింది. ఇదిలావుండగా, హెడ్ కానిస్టేబుల్ టి జితేందర్ ఈ నెల ప్రారంభంలో కరోనా పాజిటివ్ రావడంతో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందుతూ మరణించారు. ఇక, ఇటీవలే ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా బారినపడిన ఇద్దరు అటవీ అధికారులు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిన సంగతి తెలిసిందే. నార్నూరు మండలంలో ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ)గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వర్‌ (55), ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీఓ)సునీల్ ‌(36) కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వీరిద్దరూ ఇటీవల కరోనా బారినపడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Read also : Aryabhata : భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించిన రోజు, ఆపై ప్రపంచ రికార్డు వరకూ ఇస్రో ప్రస్థానం

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే