Telangana High Court: తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలను తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల

Telangana High Court: తెలంగాణలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
High Court
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 20, 2021 | 5:48 PM

తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలను తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. దీనితో గురుకులాలు తెరవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సవరించింది.

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను తెరుచుకోవచ్చునని న్యాయస్థానం పేర్కొంది. గురుకులాలలో ప్రత్యక్ష, ఆన్‌లైన్ బోధనా చేపట్టాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. విద్యాసంస్థల్లో కోవిడ్ నియంత్రణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏజీ ప్రసాద్ కోర్టుకు వివరించారు.

Also Read: