Akhanda 2: ‘మేము వద్దన్నాక టికెట్లు అమ్మడమేంటి.. కోర్టంటే లెక్క లేదా’.. అఖండ 2 నిర్మాతలు, BMSపై గుస్సా
'కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా? పెంచిన ధరలతో టికెట్లు ఎందుకు విక్రయించారు.?' అని ప్రశ్నించింది. తాము వద్దన్నాక కూడా బుకింగ్స్ ఓపెన్ చేయడంపై BMS నిర్వాహకులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అటు టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు చెప్పాక జీవో రద్దు చేశామన్నారు అధికారులు.

అఖండ-2 టికెట్ల దోపిడీపై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన ఆదేశాలు ధిక్కరించడంపై BMS, అఖండ-2 మూవీ నిర్మాతలపై హైకోర్టు సీరియస్ అయింది. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా? పెంచిన ధరలతో టికెట్లు ఎందుకు విక్రయించారు.?’ అని ప్రశ్నించింది. తాము వద్దన్నాక కూడా బుకింగ్స్ ఓపెన్ చేయడంపై BMS నిర్వాహకులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అటు టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు చెప్పాక జీవో రద్దు చేశామన్నారు అధికారులు. జీవో రద్దు చేసినట్టు కోర్టుకు చెప్పారు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. బుక్‌మై షోకి కూడా హైకోర్టు ఉత్తర్వులు అందించామని వివరించారు. అయినా ఆన్‌లైన్‌లో అమ్మకాలు ఎలా జరిగాయని హైకోర్టు ప్రశ్నించింది. అప్పటికే షో టైమ్ అయిపోయిందంటూ బుక్‌మై షో నిర్వాహకుల వివరణ ఇచ్చారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
మాకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టిక్కెట్లు కొనుగోలు చేశారన్నారు బుక్ మై షో నిర్వాహకులు. ‘ఇప్పుడు పెంచిన రేట్లతో టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారా.. లేదా..’ మీ మీద కోర్టు ధిక్కరణ చర్య ఎందుకు తీసుకోకూడదో చెప్పండి.. ఒంటిగంటకల్లా తమకు సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే బుక్ మై షో నిర్వాహకులు మాత్రం తము చీఫ్ జస్టిస్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్తామన్నారు. అలాగే టికెట్ రేట్ల పెంపుపై నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను.. డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది 14 రీల్స్ సంస్థ. లంచ్ మోషన్ కింద మెన్షన్ చేసింది. డివిజన్ బెంచ్‌లో మధ్యాహ్నం రెండున్నరకు విచారణ జరపనుంది. మరోవైపు టికెట్ రేట్లను పెంచుతూ ప్రతిసారీ మెమో ఇవ్వడంపై హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పక్కన పెట్టి ప్రతి భారీ సినిమాకు మెమోలు ఇవ్వటంపై హైకోర్ట్ సీరియస్ అయింది. ఎందుకు టిక్కెట్ రేట్లను పెంచుతున్నారో వివరణ ఇవ్వాలని హోమ్ సెక్రెటరీకి హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ కౌంటర్ దాఖలు చేయనుంది ప్రభుత్వం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








