Telangana DH: వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్.. ఖమ్మంలో విచిత్ర పూజలు.. అసత్య ఆరోపణలు తగవని హెచ్చరిక
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్(Telangana DH) వివాదంలో చిక్కుకున్నారు. దేవుడు కరుణించాలంటూ ఖమ్మంలో(Khammam) వింత పూజలు నిర్వహించారు. తనకు తాను దేవతగా ప్రకటించుకున్న ఓ మహిళా ఎంపీపీ చుట్టూ ఆయన పూనకంతో ఊగిపోతూ ప్రదక్షిణలు చేశారు. మంటల్లో...
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్(Telangana DH) వివాదంలో చిక్కుకున్నారు. దేవుడు కరుణించాలంటూ ఖమ్మంలో(Khammam) వింత పూజలు నిర్వహించారు. తనకు తాను దేవతగా ప్రకటించుకున్న ఓ మహిళా ఎంపీపీ చుట్టూ ఆయన పూనకంతో ఊగిపోతూ ప్రదక్షిణలు చేశారు. మంటల్లో మిరపకాయలు వేస్తూ పూజలు చేశారు. అయితే సైన్స్ బోధించాల్సిన డీహెచ్ ఇలాంటి పూజలు చేయడం ఏంటని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీనివాస్ క్షుద్రపూజల తరహాలో చేశారని రాజకీయ ఎంట్రీ కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే, తనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో డీహెచ్ స్పందించారు. తమ స్వస్థలం కొత్తగూడెం(Kothagudem) ప్రాంతంలో హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు అక్కడకు వెళ్లినట్లు తెలిపారు. అయితే బంజారా కమ్యూనిటీ వాళ్లు తమ కుల దేవతకు పూజలు చేస్తున్నారని చెబితే ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. తాను హోమానికి దండం పెట్టానని, వ్యక్తికి కాదని చెప్పుకొచ్చారు. రాజకీయాలతో తనకు సంబంధం లేదని తెలిపారు.
నేను ఎలాంటి క్షుద్రపూజల్లో పాల్గొనలేదు. సేవా కార్యక్రమాలను ఓర్వలేకనే కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలాంటి బురద జల్లే వ్యక్తుల మాటలను ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారి పూజల్లో పాల్గొంటే తప్పేందముంది. స్థానికుల ఆహ్వానంతోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్మండలంలో జరిగిన పూజ కార్యక్రమానికి వెళ్లా. స్వయం ప్రకటిత దేవతతో సంబంధం లేదు. మూఢ నమ్మకాలను అసలే విశ్వసించను. తప్పుడు అర్థాలు తీసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. కరోనాకు ముందు కూడా ఎన్నోసార్లు కొత్త గూడెం ప్రాంతానికి వస్తూ ఉండేవాడిని. రాష్ట్రానికి హెల్త్ డైరెక్టర్గా ఉన్న నాకు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏం ఉంది.
– శ్రీనివాస్, తెలంగాణ హెల్త్ డైరెక్టర్
మెగా హెల్త్ క్యాంపు ఏర్పాట్లు భాగంలోనే గత కొంత కాలంలో కొత్తగూడెం ప్రాంతంలో విస్తృతంగా ఆయన పర్యటిస్తున్నారు. విద్య, వైద్యం, ఉపాధిపై దృష్టి సారించి ట్రస్ట్ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్లు చేపించానని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. పేదలకు మేలు జరగడం కోసం తాను చేసే సేవా కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు.
Also Read
Dates: రంజాన్ నెలలో ఉపవాసం చేసేవారు ఖర్జూర ఎందుకు తింటారో తెలుసా..?
Telangana: హత్య చేసేందుకే వచ్చారంటున్న సర్పంచ్ భర్త.. అమీన్ పూర్ తుపాకీ హల్చల్ ఘటనలో కొత్త ట్విస్ట్