Dates: రంజాన్‌ నెలలో ఉపవాసం చేసేవారు ఖర్జూర ఎందుకు తింటారో తెలుసా..?

రంజాన్(Ramadan) నెలలో ఉపవాసం ఉన్నవారు.. ఆహారం తీసుకునే ముందు ఖర్జూర(dates) కచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే...

Dates: రంజాన్‌ నెలలో ఉపవాసం చేసేవారు ఖర్జూర ఎందుకు తింటారో తెలుసా..?
Dates Benefits
Follow us

|

Updated on: Apr 06, 2022 | 7:12 PM

రంజాన్(Ramadan) నెలలో ఉపవాసం ఉన్నవారు.. ఆహారం తీసుకునే ముందు ఖర్జూర(dates) కచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఖర్జూరతో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఖర్జూరాలలో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, జింక్(Zink), ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఖర్జూరాలను తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగవు. ఎందుకంటే వీటిలో కొలెస్ట్రాల్ ఉండదు. ముఖ్యంగా ఈ ఎండు పండ్లలో కొవ్వు కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. చక్కెర మన ఆరోగ్యానికి మంచిది కాదు. షుగర్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

అందుకే డాక్టర్లు షుగర్ వాడకాన్ని తగ్గించాలని చెబుతుంటారు. అయితే ఈ చక్కెరకు బదులుగా ఖర్జూరాలు ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ఖర్జూరాలను నానబెట్టాలి. ఆ నీళ్లని పాయసం, జ్యూస్‌లు, లడ్డూల తయారీలో వాడుకోవచ్చు. వీటితో తయారు చేసిన ఆహారాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఖర్జూరాలో విటమిన్ ఎ1, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5 లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే ఉపవాసం చేసే సమయాల్లో వీటిని ఎక్కువగా తీసుకుంటారు.

ఖర్జూరా పండ్లలో మెగ్నీషియం, సెలీనియం, కాపర్, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా తయారుచేస్తాయి. అలాగే ఆస్టియోపొరాసిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఖర్జూర స్కిన్‌ను స్మూత్గా చేసే గుణముంటుంది. ఈ పండులో ఉండే విటమిన్ డి, సి స్కిన్ సాగే గుణాన్నిపెంచుతాయి. అజీర్థి, మలబద్దకం సమస్యతో బాధపడుతున్నవారికి ఖర్జూరా పండ్లు దివ్య ఔషదంగా ఉంటాయి. ఇందుకోసం కొన్ని రోజుల పాటు ఖర్జూరా పండ్లను నీటిలో నానబెట్టి తినాలి.

గమనిక :- ఈ కథనం కేవలం ఇతర నివేదికల ఆధారంగా.. నిపుణుల సూచనల ప్రకారం మాత్రమే ఇవ్వబడింది. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.

Read also.. Ginger Health Benefits: శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరిగిపోతుందా..? అల్లంతో అద్భుతమైన ప్రయోజనం