AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC By Election: తెలంగాణలో నేటితో ముగియనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారం.. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యుహాలు!

పరువు..ప్రతిష్ట.. పరీక్ష. రెఫరెండం కాకపోయినా సరే వరంగల్‌- నల్లగొండ- ఖమ్మం గ్రాడ్యూయేట్‌ MLC ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టగా మారింది. పవర్‌కు తగ్గట్టుగా హిట్‌ కొట్టాలని కాంగ్రెస్‌, సిట్టింగ్‌ సీటును చేజిక్కించుకోని కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని బీఆర్‌ఎస్‌, ఫ్యూచర్‌ పాలిటిక్స్‌కు నిచ్చెనగా పెద్దలసభలో పాగా వేయాలని బీజేపీ… ఇలా మూడు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

MLC By Election: తెలంగాణలో నేటితో ముగియనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారం.. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యుహాలు!
Mlc Election
Balaraju Goud
|

Updated on: May 25, 2024 | 8:58 AM

Share

పరువు..ప్రతిష్ట.. పరీక్ష. రెఫరెండం కాకపోయినా సరే వరంగల్‌- నల్లగొండ- ఖమ్మం గ్రాడ్యూయేట్‌ MLC ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టగా మారింది. పవర్‌కు తగ్గట్టుగా హిట్‌ కొట్టాలని కాంగ్రెస్‌, సిట్టింగ్‌ సీటును చేజిక్కించుకోని కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని బీఆర్‌ఎస్‌, ఫ్యూచర్‌ పాలిటిక్స్‌కు నిచ్చెనగా పెద్దలసభలో పాగా వేయాలని బీజేపీ… ఇలా మూడు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

వరంగల్‌, నల్గొండ, ఖమ్మం పట్టుభద్రుల MLC ఉపఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఈసారి గెలుపే లక్ష్యంగా బీజేపీ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. మొత్తం 50 మంది పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధానంగా బీజేపీ, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు అత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహిస్తూ అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో… బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.

మార్పు నినాదంతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్‌..పార్లమెంట్‌ సహా MLC ఎన్నికపై తన మార్క్‌ను చాటాలని ఉవ్విలూరుతోంది. అందుకే వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ఏకంగా ఆరుగురు మంత్రులను సైతం రంగంలోకి దించింది. జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఈ MLC ఎన్నికల్లో కూడా పట్టభద్రులు కాంగ్రెస్‌ వైపే వున్నారని చాటుకునేలా వ్యూహాలకు పదను పెడుతోంది కాంగ్రెస్‌. చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను గెలిపించేందుకు కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతోంది.

వరంగల్‌-నల్లగొండ- ఖమ్మం పట్టభద్రుల MLC ఎన్నికను గెలవడం కాంగ్రెస్‌కు ఎంత ఆవశ్యకమో..బీఆర్‌ఎస్‌కు కూడా అంతే. అసలు ఈ ఎన్నిక వచ్చిందే పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో. సో.. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవడం బీఆర్‌ఎస్‌కు ప్రెస్టేజీ ఇష్యూగా మారింది. కేటీఆర్‌, హరీష్‌రావు సహా ఆ పార్టీ ముఖ్య నేతలంతా ఈ ఎన్నికపై దృష్టి సారించారు. రేవంత్‌ సర్కార్‌ ఆరు గ్యారెంటీల హామీల అమలులో విఫలమైందని..ప్రశ్నించే అభ్యర్థి ఏనుగు రాకేష్‌రెడ్డికి ఓటెయ్యాలని విజ్ఙప్తి చేస్తూ ప్రచారం నిర్వహిస్తోంది BRS.

మొత్తానికి ఎవరి వ్యూహాలు వాళ్లకున్నాయి. పెద్దల సభలో పై చేయి సాధించాలని మూడు పార్టీలు పంతం మీదున్నాయి.మరి పట్టభద్రుల తీర్పు ఎటు అన్నది చర్చగా మారిందిప్పుడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…