Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో అమేజాన్ భారీ పెట్టుబడులు.. ఏకంగా 36 వేల కోట్లు.. ఇవిగో వివరాలు

హైదరాబాద్ లోని వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ లలో అమేజాన్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి 36 వేల 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమేజాన్ తెలిపింది.

Telangana: తెలంగాణలో అమేజాన్ భారీ పెట్టుబడులు.. ఏకంగా 36 వేల కోట్లు.. ఇవిగో వివరాలు
Minister KTR
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 20, 2023 | 10:28 PM

అమేజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ, అదనపు పెట్టుబడి ప్రకటనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు స్వాగతించారు. అమేజాన్ వెబ్ సర్వీసెస్ ఏషియా పసిఫిక్ రీజియన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ లో 2030 నాటికి 36 వేల 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా అమేజాన్ సంస్థ పెట్టడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన అమేజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్‌లో దావోస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అమేజాన్ సంస్థ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమేజాన్, తెలంగాణ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న కేటీఆర్, సంస్థ విస్తరణ ప్రణాళికలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అత్యుత్తమ క్లౌడ్ సేవలను అందించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్‌ చందన్‌వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్ లను అమేజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటుచేసింది. ఈ మూడు డేటా సెంటర్ ల మొదటి దశ పూర్తై వినియోగదారులకు పూర్తిస్థాయిలో క్లౌడ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు డేటా సెంటర్లలో మొదట (2020 సంవత్సరంలో) 20 వేల 96 కోట్ల రూపాలయను పెట్టుబడిగా పెట్టాలనుకుంది అమేజాన్. అయితే విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దశల వారీగా 36 వేల 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టాలని అమేజాన్ తాజాగా నిర్ణయించుకుంది. అమేజాన్ సంస్థకు పెట్టుబడుల గమ్యస్థానంగా ముందునుంచి హైదరాబాద్ ఉంది. ప్రపంచంలోనే తన అతిపెద్ద వెబ్ సర్వీసెస్ క్యాంపస్ తో పాటు ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ లు రెండింటిని హైదరాబాద్ లోనే అమేజాన్ ఏర్పాటుచేసింది. ఇక అమేజాన్ వెబ్ సర్వీసెస్ అందించే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ డేటా సెంటర్లలో పెట్టుబడులను అమేజాన్ విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద ఎఫ్.డి.ఐ లలో ఇదొకటన్నారు. ఇ-గవర్నెన్స్, హెల్త్‌కేర్, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరచడానికి AWSతో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ లోని అమేజాన్ వెబ్ సర్వీసెస్ క్యాంపస్ లతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు స్టార్టప్ లకు ప్రయోజనం కలుగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు కేటీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం