Hyderabad: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. నిలిచిపోయిన రైలు.. రంగంలోకి భద్రతా బలగాలు

తిరుపతి నుంచి ఆదిలాబాద్‌ వెళుతోన్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టామంటూ ఓ అగంతకుడు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేయడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, రైల్వే సిబ్బంది మౌలాలి దగ్గరే రైలును ఆపేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు

Hyderabad: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. నిలిచిపోయిన రైలు.. రంగంలోకి భద్రతా బలగాలు
Krishna Express
Follow us

|

Updated on: Jan 20, 2023 | 10:46 PM

తిరుపతి నుంచి ఆదిలాబాద్‌ వెళుతోన్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టామంటూ ఓ అగంతకుడు పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఫోన్‌ చేయడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, రైల్వే సిబ్బంది మౌలాలి దగ్గరే రైలును ఆపేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా మరికొద్దిసేపట్లో ఈ ట్రైన్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌లో  భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.  ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది ఆగమేఘాల మీద స్టేషన్ కు చేరుకుని ముమ్మరంగా తనిఖీలు భావిస్తున్నారు. మరోవైపు ఇది ఆకతాయిల పనేనని పోలీసులు భావిస్తున్నారు. అయితే ముందు జాగ్రత్తగా డాగ్ స్వాడ్‌తో బోగీల‌న్నింటినీ క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫోన్ చేశాడ‌ని తెలుస్తున్న‌ది. అయితే చివరకు ఎలాంటి బాంబు లేదని  తనిఖీల అనంతరం పోలీసులు నిర్ధరించడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. మౌలాలి స్టేషన్‌ నుంచి రైలు గమ్యస్థానానికి బయలుదేరింది.  బాంబు ఉందంటూ ఫోన్‌ చేసిన ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..