Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alai Balai: దత్తన్న అలయ్‌ బలయ్‌ను ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై.. ముఖ్య అతిధిగా పాల్గొన్న పవన్‌ కళ్యాణ్

హైదరాబాద్‌లో దత్తన్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమం మొదలైంది. జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌ సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో పాటు ఈసారి జనసేన అధినేత

Alai Balai: దత్తన్న అలయ్‌ బలయ్‌ను ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై.. ముఖ్య అతిధిగా పాల్గొన్న పవన్‌ కళ్యాణ్
Pawan Kalyan
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 17, 2021 | 11:49 AM

Pawan kalyan – Alai Balai: హైదరాబాద్‌లో దత్తన్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమం మొదలైంది. జలవిహార్‌లో అలయ్‌ బలయ్‌ సాంస్కృతిక కార్యక్రమాలను గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో ఏళ్లుగా సాంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. ఈసారి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ అలయ్‌ బలయ్‌కు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత కళాకారులతో కలిసి గవర్నర్‌ స్టెప్పులు వేశారు. గిరిజన మహిళల నృత్యాలు, ఒగ్గు డోలు విన్యాసాలు, పెద్దపులుల వేసాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి.

హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు గవర్నర్‌ తమిళిసైకు ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో దసరా సంబురాలు గొప్పగా ఉన్నాయన్నారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలు చాలా సంతోషంగా జరుపుకొంటున్నామని చెప్పారు.

Pawan Alai Balai

Pawan Alai Balai

రాజ్‌భవన్‌లో కూడా బతుకమ్మను ఘనంగా జరుపుకున్నామని గవర్నర్ వెల్లడించారు. అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత 15 ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయను గవర్నర్ అభినందించారు.

ఇక, అలయ్‌ బలయ్‌ కార్యక్రమం అద్భుతంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు ఉండాలని చెప్పారు.ఈ కార్యక్రమానికి హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, సినీనటుడు కోట శ్రీనివాసరావు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు సైతం హాజరయ్యారు.

Read also: AP Power Cuts: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలపై వదంతులు నమ్మొద్దు, కోతలు ఉండవు: ఏపీఈపీడీసీఎల్‌

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!