AP Power Cuts: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలపై వదంతులు నమ్మొద్దు, కోతలు ఉండవు: ఏపీఈపీడీసీఎల్‌

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలపై వదంతులు నమ్మొద్దని ఈపీడీసీఎల్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ సంతోష్‌రావు స్పష్టతనిచ్చారు. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును

AP Power Cuts: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలపై వదంతులు నమ్మొద్దు, కోతలు ఉండవు: ఏపీఈపీడీసీఎల్‌
Power Cuts
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 17, 2021 | 10:34 AM

Andhra Pradesh Power Cuts: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలపై వదంతులు నమ్మొద్దని ఈపీడీసీఎల్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ సీఎండీ సంతోష్‌రావు స్పష్టతనిచ్చారు. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ప్రభుత్వం సరఫరా చేసిందన్న ఆయన, విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, విద్యుత్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

కాగా, విద్యుత్ సంక్షోభాన్ని అరికట్టేందుకు బొగ్గు కొనుగోలు నిమిత్తం ఏపీ జెన్‌కోకు రూ.250 కోట్లు నిధులు, రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించారు. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడున్నా కొనుగోలు చేయాలని ఏపీ జెన్‌కోను ప్రభుత్వం ఆదేశించింది. స్వల్పకాలిక మార్కెట్‌ నుంచి కొనుగోలు చేయాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర విద్యుత్‌ సంస్థల నుంచి కేటాయించబడని వాటా నుంచి సమీకరణ యత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది.​

వచ్చే ఏడాది జూన్‌ వరకు 400 మెగావాట్ల విద్యుత్‌ కోసం కేంద్రాన్ని అభ్యర్థించింది ఏపీ సర్కారు. సింగరేణి సంస్థతో సమన్వయం చేసుకుని బొగ్గు సరఫరా కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. వీటీపీఎస్‌, కృష్ణపట్నంలోనూ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మరోవైపు, విద్యుత్‌ కోతలపై నడుస్తోన్న ప్రచారాన్ని అటు, ఇంధన శాఖ సైతం ఖండించింది. పట్టణాలు, గ్రామాల్లో గంటల తరబడి కోతలంటూ జరుగుతోన్నది సరికాదని ఇంధన శాఖ అధికారులు అంటున్నారు.

Read also: Balakrishna: సీమలో నేడు ఇంట్రెస్టింగ్‌ మీటింగ్‌.. హాజరుకాబోతోన్న హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ