SBI: ఇల్లు కొనాలనుకుంటున్నారా.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. ఈ ప్రకటన చూడండి..
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల కోసం భారీ ఆఫర్‌తో తీసుకొచ్చింది. మీరు కూడా ఇల్లు, షాప్..
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ల కోసం భారీ ఆఫర్‌తో తీసుకొచ్చింది. మీరు కూడా ఇల్లు, షాప్ లేదా ప్లాట్లు కొనాలనుకుంటే.. అది మీకు సువర్ణావకాశం. SBI ఖరీదైన ఆస్తులను చౌకగా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. వాస్తవానికి బ్యాంక్‌లో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తోంది. SBI అక్టోబర్ 25 న వాణిజ్య, నివాస స్థలాల కోసం ఆన్‌లైన్ వేలం నిర్వహిస్తోంది. మీరు కూడా ఈ అద్భుతమైన ఆఫర్‌లో పాల్గొనడం ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు.
వేలంకు సంబంధించి ఓ ప్రకటనను ఎస్‌బీఐ అందిస్తోంది. అది ఫ్రీహోల్డ్ లేదా లీజుహోల్డ్ అని పేర్కొంది. వేలం కోసం జారీ చేసిన పబ్లిక్ నోటీసు దాని కొలత స్థానం మొదలైన వాటితో పాటు ఇతర వివరాలతో కూడా పేర్కొంది. SBI ఇచ్చిన ప్రకటన ప్రకారం.. బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తుల వేలం కోర్టు అనుమతి తర్వాత జరుగుతుంది.
Bid from your home! Join us during the e-auction and place your best bid.
Know more: https://t.co/vqhLcagoFF #Auction #EAuction #Properties #SBI_MegaEAuction pic.twitter.com/gMyyPtKPlU
— State Bank of India (@TheOfficialSBI) October 16, 2021
బ్యాంకు ఏ ఆస్తిని వేలం వేస్తుంది..
బ్యాంకు ప్రజలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకు గ్యారెంటీ రూపంలో వారికి నివాస ఆస్తి లేదా వాణిజ్య ఆస్తిని తనఖా పెట్టింది. రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే బ్యాంక్ తన తనఖా ఆస్తిని రికవరీ కోసం వేలం వేస్తుంది. బ్యాంకు సంబంధిత శాఖలు వార్తాపత్రికలు ఇతర మాధ్యమాల ద్వారా ప్రకటనలను ప్రచురిస్తాయి. ఆస్తుల వేలానికి సంబంధించిన సమాచారం ఈ ప్రకటనలో ఇవ్వబడుతుంది.
ఇలా ఈ-వేలంలో పాల్గొనండి
మీరు SBI నిర్వహించే ఇ-వేలంలో పాల్గొనాలంటే నోటీసులో ఇచ్చిన సంబంధిత ఆస్తి కోసం EMD సమర్పించాలి. ‘KYC డాక్యుమెంట్లు’ సంబంధిత బ్యాంక్ శాఖలో చూపించాల్సి ఉంటుంది. వేలంలో పాల్గొనే వ్యక్తి తప్పనిసరిగా డిజిటల్ సంతకాన్ని కలిగి ఉండాలి. కాకపోతే, ఇ-వేలం నిర్వహించే వ్యక్తి లేదా ఏదైనా ఇతర అధీకృత ఏజెన్సీని దీని కోసం సంప్రదించవచ్చు. ‘KYC డాక్యుమెంట్లు’ సంబంధిత బ్యాంక్ శాఖలో చూపించాల్సి ఉంటుంది. వేలంలో పాల్గొనే వ్యక్తి తప్పనిసరిగా డిజిటల్ సంతకాన్ని కలిగి ఉండాలి. దీని కోసం, మీరు ఇ-వేలం లేదా ఏదైనా ఇతర అధీకృత ఏజెన్సీని సంప్రదించడం ద్వారా దీనిని పొందవచ్చు.
ఇవి కూడా చదవండి: Software Update: మీ ఫోన్‌కు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ మెసెజ్ వస్తోందా.. చేసుకోక పోతే ఇక అంతే..
Kotia Dispute: ఆంధ్రా -ఒడిషా బోర్డర్‌లో టెన్షన్.. రోజు రోజుకూ హీటెక్కుతున్న కొటియా కొట్లాట..