Balakrishna: సీమలో నేడు ఇంట్రెస్టింగ్ మీటింగ్.. హాజరుకాబోతోన్న హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ
రాయలసీమలో ఇవాళ ఇంట్రెస్టింగ్ మీటింగ్ జరుగబోతోంది. సీమ టీడీపీ నేతల సదస్సు నేడు హిందూపురంలో నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్‌కు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరుకాబోతున్నారు.
Hindupuram meeting: రాయలసీమలో ఇవాళ ఇంట్రెస్టింగ్ మీటింగ్ జరుగబోతోంది. సీమ టీడీపీ నేతల సదస్సు నేడు హిందూపురంలో నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్‌కు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరుకాబోతున్నారు. కృష్ణ జలాల పరిరక్షణ కోసం ఈ సదస్సు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన మీటింగ్‌లో టీడీపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డ నేపథ్యంలో ఈ సదస్సులో ఎలాంటి ఘటనలు జరుగుతాయో అనే ఆందోళన మాత్రం పార్టీలో ఉంది. ఇటు చాలా రోజుల తర్వాత బాలయ్య హిందూపురంకు వస్తున్నారు. నీటి వనరుల్లో రాయలసీమకు జరుగుతున్న అన్యాయం, కృష్ణా జలాలు-రాయలసీమ హక్కుల సాధన చర్చావేదిక సదస్సును స్థానిక జేవీఎస్ ఫంక్షన హాల్‌లో ఈ మీటింగ్ నిర్వహించనున్నారు.
సమావేశంకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారధి.. పార్టీ నేతలతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రానికి వాటిల్లుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని స్థితిలో ముఖ్యమంత్రి జగన ఉన్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో సాగు, తాగు నీటి ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయాయంటున్నారు. ముఖ్యమంత్రి వైఫల్యంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో 107 కేంద్రం పర్యవేక్షణలోకి వెళ్లాయని నేతలు చెప్పుకొస్తున్నారు. జగన మొద్దునిద్రతో తెలంగాణకు ధారదత్తం చేస్తూ రాయలసీమను సర్వనాశనం చేస్తున్నారని సీమ టీడీపీ నేతలు విమర్శిలు గుప్పిస్తున్నారు.
హంద్రీనీవా పథకాన్ని తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌దనీ, పథకానికి 2014నుంచి 2019 టీడీపీ హ యాంలోనే రూ.4వేల కోట్ల ఖర్చు పెట్టి చంద్రబాబు కృషితో జిల్లాకు కృష్ణాజలాలు వచ్చాయని సీమ తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హంద్రీనీవా రాకతో జిల్లా వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధి సాధ్యపడిందని.. జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో హంద్రీనీవాపై నయా పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శిస్తున్నారు.
Read also: TRS: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం ఎల్పీ మీటింగ్