CM KCR: దేశ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు.. తెలంగాణ సీఏం సందేశం ఇదే..
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని తన..

దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని దేశ ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకొంటారని తన సందేశంలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానపుకాంతులు ప్రసరింప చేయడమనే తత్వాన్ని దీపావళి మనకు నేర్పుతుందన్నారు. తెలంగాణ మాదిరే, దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని, సుఖ శాంతులతో సిరి సంపదలతో తుల తూగాలని దీపావళి సందర్భంగా సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు. బాణా సంచా వెలిగించే సందర్భంలో ప్రమాదాలకు గురికాకుండా, భక్తి శ్రద్ధలతో పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రజలను, సీఎం కేసీఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి ( టిఆర్ ఎస్ ) పార్టీని భారత్ రాష్ట్ర సమితి ( బీఆర్ ఎస్ ) గా మార్చడంతో పాటు దేశ రాజకీయాల్లోకి అరంగ్రేటం చేస్తున్నట్లు ఇటీవల సీఏం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో కర్ణాటక, మహారాష్ట్రలో తమ పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రజలతో పాటు దేశ ప్రజలందరికీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
సీఏం కేసీఆర్ తో పాటు తెలంగాన గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా ప్రజలకు దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.




— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) October 23, 2022
మంత్రులు, టీఆర్ ఎస్ ఎమ్మె్ల్యేలతో పాటు ప్రధాన రాజకీయ పార్టీ నాయకులంతా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీపావళిని కూడా నియోజకవర్గంలోని ప్రజలతో కలిసి చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసినప్పటి నుంచి మునుగోడులో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలంతా మునుగోడులోనే ఉన్నారు. దీంతో ఇక్కడ ముందుగానే దీపావళి వచ్చిన వాతావరణం నెలకొంది. ఈ ఎన్నిక జరుగుతున్న సమయంలోనే దీపావళి రావడంతో తెలంగాణలోని మునుగోడులో ప్రజాప్రతినిధుల నడుమ దీపావళి జరిగే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..