Telangana: స్మశానంలో అంత్యక్రియలు చేస్తుండగా తేనెటీగల దాడి.. ఒకరు మృతి.. 12 మందికి..

వృద్ధురాలి దహన సంస్కారాల కోసం స్మశానానికి వెళ్లిన గ్రామస్థులపై తేనెటీగలు దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా మరో 12 మందికి గాయాలయ్యాయి.

Telangana: స్మశానంలో అంత్యక్రియలు చేస్తుండగా తేనెటీగల దాడి.. ఒకరు మృతి.. 12 మందికి..
Honey Bees
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 23, 2022 | 7:28 PM

విధి మనషుల జీవితాలతో ఆడుకుంటుందని తెల్సు కానీ.. మరీ ఇంతలా అని తెలీదు.  అవును.. ఓ వృద్ధురాలి మృతదేహానికి స్మశానంలో అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉండగా.. ఒక్కసారిగా అటాక్ చేశాయి తేనెటీగలు. తేనెటీగల దాడిలో ఒకరు మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో.. మృతదేహాన్ని అక్కడే వదిలేసి పరుగులు తీశారు జనాలు. మంచిర్యాల జిల్లా: కోటపల్లి మండలంలోని బబ్బెరు చెలుక గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

బబ్బెర చిలుక గ్రామానికి చెందిన కొండపర్తి చంద్రకాంత అనే వృద్ధురాలు మృతి చెందగా, ఆమె అంత్యక్రియలకు వెళ్లిన వారిపై ఒక్కసారిగా దాడి చేశాయి తేనెటీగలు. జనాలు తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది.  తేనెటీగల దాడిలో బొల్లంపెళ్లి బాపు అనే వ్యక్తి స్పాట్‌లో మృతి చెందాడు. గాయపడ్డవారిని  చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో.. గ్రామంలో ఆందోళన నెలకుంది.

అంత్యక్రియల కోసం చితి పేర్చారు. మృతదేహాన్ని చితిపై పడుకోబెట్టారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద తేనెటీగలు రివ్వున సౌండ్ చేసుకుంటూ దూసుకువచ్చాయి. కాస్త వేగంగా పరిగెత్తగలిగినవారు కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారు. మిగిలినవారిపై మెరుపు వేగంతో దాడి చేశాయి తేనెటీగలు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకుంది. ఫైనల్‌గా ఒకరిని బలి తీసుకుని.. పలువురుని గాయపరిచాయి తేనెటీగలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..