Munugode Bypoll: మునుగోడులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పై దాడి..
మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వార్ పీక్ స్టేజికి వెళ్లింది. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పైన దాడికి దిగారు బీజేపీ కార్యకర్తలు. దీంతో ఆమె రోడ్డుపైనే..
మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వార్ పీక్ స్టేజికి వెళ్లింది. కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పైన దాడికి దిగారు బీజేపీ కార్యకర్తలు. దీంతో ఆమె రోడ్డుపైనే నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలంలో ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి మండలంలో ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్నారు. అదే సమయంలో అదే రోడ్డులో బీజేపీ కార్యకర్తల వెహికల్స్ వెళ్తున్నాయి. అయితే, స్రవంతి కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చారు. కాంగ్రెస్ కాన్వాయ్‌కి సైడ్ ఇవ్వలేదు. దాంతో వివాదం తలెత్తింది.
తమకు సైడ్ ఇవ్వకుండా అడ్డువస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మరోవైపు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇరుపార్టీల కార్యకర్తల మధ్య మాటా మాటా పెరిగి దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఘర్షణ తీవ్రమవగా కొందరు బీజేపీ కార్యకర్తలు పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పై దాడి చేశారు. బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్రవంతి, కాంగ్రెస్ కార్యకర్తలు.. రోడ్డుపైనే బైఠాయించారు. నిరసన చేపట్టారు. జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి. తమపై దాడి చేసిన బీజేపీ గుండాలపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఖబర్దార్ బీజేపీ నాయకుల్లారా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే సీతక్క..
పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తల దాడి ఘటనపై ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉందని, భౌతిక దాడులకు దిగడం సరైన విధానం కాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. దాడికి పాల్పడిన బీజేపీ గుండాలను గుర్తించి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు సీతక్క.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..