Jagtial: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో – కారు ఢీ.. ముగ్గురు మహిళలు దుర్మరణం..

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేట సమీపంలో ఓ కారు వేగంగా వెళ్తోంది. అదే సమయంలో..

Jagtial: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో - కారు ఢీ.. ముగ్గురు మహిళలు దుర్మరణం..
Road Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 23, 2022 | 4:01 PM

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేట సమీపంలో ఓ కారు వేగంగా వెళ్తోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆటో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. ఆటోలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చనిపోయిన వారందరూ ధర్మపురి మండలం కమలాపూర్‌కు చెందినవారే. కారు కరీంనగర్ నుంచి వెల్గటూరు వైపు, ఆటో ధర్మపురి నుంచి ధర్మారం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారంతా ఆటోలో ప్రయాణిస్తున్నవారే కావడం విషాదం నింపింది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి