CM Revanth Reddy: వీరికి రూ.5లక్షలు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. పూర్తి వివరాలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే తాము హామీ ఇచ్చిన పథకాలను అమలు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజే రెండు గ్యారెంటీల అమలుపై సంతకాలు చేశారు. మరిన్ని పథకాలు ప్రజలకు అందించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే తాము హామీ ఇచ్చిన పథకాలను అమలు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజే రెండు గ్యారెంటీల అమలుపై సంతకాలు చేశారు. మరిన్ని పథకాలు ప్రజలకు అందించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈక్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకం అమలు చేసింది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఓలా, ఉబర్, గిగా డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్ట్‌లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు.
గతంలో గిగ్ వర్కర్ల కోసం రూ.5లక్షల ప్రమాద బీమా తీసుకొస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్ గిగ్ వర్కర్ల సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం ఇప్పటికే రాజస్థాన్ అమలు చేస్తోంది. అక్కడి ప్రభుత్వాలు చేపట్టిన చట్టాన్ని అధ్యయనం చేసి, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. దీని కోసం ప్రత్యేకంగా రిజిస్టరింగ్ అథారిటీ, క్లెయిమ్ రిసీవింగ్ అథారిటీని కూడా నియమిస్తున్నట్లు తాజాగా ప్రకటించిన జీవోలో స్పష్టం చేశారు. ఈ జీవోతోపాటు నాలుగు నెలల క్రితం కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ రిజ్వాన్ సీఎం రేవంత్ ఆదుకున్నారు. ఆ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల చెక్కును శనివారం సచివాలయంలో అందజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..