Telangana: ఫ్రీ బస్‌ ఎఫెక్ట్‌.. కండక్టర్‌తో కన్నీళ్లు పెట్టించిన మహిళలు అత్యుత్సాహం.!

Telangana: ఫ్రీ బస్‌ ఎఫెక్ట్‌.. కండక్టర్‌తో కన్నీళ్లు పెట్టించిన మహిళలు అత్యుత్సాహం.!

Anil kumar poka

|

Updated on: Dec 30, 2023 | 8:33 PM

ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్లుగా ఉంది ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉద్యోగులకు శాపంగా మారింది. బస్సులో ఖాళీ లేదు అన్నందుకు ఓ మహిళా కండక్టర్ ను నానా తిట్లూ తిట్టారు మహిళా ప్రయాణికులు. ఈ బస్సు మాది.. నీతో మాకు పనిలేదంటూ గొడవకు దిగారు. వారితో వాదించలేక బస్సునుండి దిగిపోయి కన్నీరుమున్నీరుగా విలపించారు ఆ మహిళా కండక్టర్‌.

ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్లుగా ఉంది ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి. ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉద్యోగులకు శాపంగా మారింది. బస్సులో ఖాళీ లేదు అన్నందుకు ఓ మహిళా కండక్టర్ ను నానా తిట్లూ తిట్టారు మహిళా ప్రయాణికులు. ఈ బస్సు మాది.. నీతో మాకు పనిలేదంటూ గొడవకు దిగారు. వారితో వాదించలేక బస్సునుండి దిగిపోయి కన్నీరుమున్నీరుగా విలపించారు ఆ మహిళా కండక్టర్‌. భద్రాచలం నుండి కొత్తగూడెం వెళ్లే పల్లె వెలుగు బస్సు సారపాక వచ్చేసరికి పూర్తిగా మహిళలతో నిండిపోయింది. నిలబడడానికి కూడా బస్సులో చోటు లేక పోవడంతో జీరో టికెట్ ఇచ్చేందుకు కాస్త జరగమంటూ మహిళా కండక్టర్ ప్రయాణికులను కోరింది. అంతే మహిళా ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ బస్సు మాది డ్రైవర్ ఉంటే సరిపోతుంది, నీతో అవసరం లేదంటూ ఆమెను నానా దుర్భాషలాడారు. దాంతో మహిళా కండక్టర్ రన్నింగ్ బస్సును నిలిపి వేసి బోరున విలపిస్తూ దిగిపోయింది. ఆ కండక్టర్‌ కూడా తమ సాటి మహిళే అన్న విచక్షణ లేకుండా సాటి మహిళలు ఆమె పట్ల ప్రవర్తించిన తీరుకు ఆమె మనస్థాపానికి గురైంది. విషయం పై అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులు సైతం ఇది ప్రభుత్వ స్కీము.. చేసేదేమీ లేక కండక్టర్‌ మళ్ళీ అదే బస్సులో వెళ్లిపోయారు. ఉచిత ప్రయాణం పేరుతో మహిళలు అవసరం లేకున్నా ప్రయాణాలు చేస్తూ ఓ పక్క ప్రభుత్వానికి నష్టం కలిగించడంమే కాక ఆర్టీసీ ఉద్యోగులను కూడా ఇబ్బందులకు గురి చేయడం సరికాదంటున్నారు. ఇప్పటికైనా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయాలని లేదంటే ఇలాంటి ఇబ్బందులే తలెత్తుతాయని అంటున్నారు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.