Hyderabad: హైదరాబాదీలకు మెట్రో గుడ్‌ న్యూస్‌.. కొత్తేడాది వేడుకల కోసం..

అర్థరాత్రి వరకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపై సందడి చేస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్‌ మెట్రో వెసులుబాటును కల్పించింది. మెట్రో వేళలను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తేడాది వేడుకల సందర్భంగా మెట్రో రైలు పనివేళలను పొడగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో తెలిపింది. డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి..

Hyderabad: హైదరాబాదీలకు మెట్రో గుడ్‌ న్యూస్‌.. కొత్తేడాది వేడుకల కోసం..
Hyderabad Metro
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 30, 2023 | 3:57 PM

కాల గర్భంలో మరో ఏడాది ముగిసేందుకు సమయం ఆసన్నమైంది. పాత ఏడాదికి గుడ్ బై చెబుతూ, కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. డిసెంబర్‌ 31ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు ప్లాన్స్‌ వేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరుగుతాయని తెలిసిందే.

అర్థరాత్రి వరకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపై సందడి చేస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్‌ మెట్రో వెసులుబాటును కల్పించింది. మెట్రో వేళలను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తేడాది వేడుకల సందర్భంగా మెట్రో రైలు పనివేళలను పొడగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో తెలిపింది. డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రి 1 గంట వరకు మెట్రో రైల్స్‌ నడపనున్నట్లు అధికారులు తెలిపారు. చివరి మెట్రో రైల్ 12.15 కి బయలుదేరి…1 గంటకి చివరి చేరుకోనుంది.

ఇక పనివేళలల పెంపుతో పాటు ప్రయాణికుల భద్రతకు సైతం మెట్రో పెద్ద పీట వేసింది. లేట్ జర్నీ ఉన్న నేపథ్యంలో ప్రయాణికు భద్రతను పెంచింది. న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో గొడవలు జరిగే అవకాశం ఉన్న క్రమంలోనే భద్రత పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. మెట్రో స్టేషన్స్‌లో మద్యం తాగడం, గొడవ పడకుండా తోటి ప్రయాణికులకు సహకరించాలని సూచించారు. అన్ని మార్గాల్లో మెట్రో పనివేళల్లో పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని స్టేష‌న్లు, రైళ్ల‌లో నిఘా ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే డిసెంబర్ 31వ తేదీన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్న నేపథ్యంలో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తులకు రూ.15వేల వరకు జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించనున్నట్టు హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..