Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కారు నడుపుతుండగానే గుండెపోటు.. సీటులోనే విగతజీవిగా

లైఫ్‌ స్టైల్ మారింది..మనిషి తిండీ మారింది. 24 బై సెవన్ జీవితంలో మనిషికి కావాల్సిన రెస్టూ దూరమైంది. ప్రకృతికి మనిషికి గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ ఆయుష్షు రేఖను తగ్గిస్తోంది. ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు గుబులు రేపుతున్నాయి. మనిషిని ఇప్పుడు నీడలా వెంటాడుతుంది ఈ గుండెపోటు. తాజాగా గుండెపోటుతో కారు నడుపుతూ ఓ వ్యక్తి మరణించాడు.

Hyderabad: కారు నడుపుతుండగానే గుండెపోటు.. సీటులోనే విగతజీవిగా
Heart Attack (Representative Image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2023 | 3:33 PM

గుండెపోటు, కార్టియాక్ అరెస్ట్.. ఇప్పుడు మనిషిని తీవ్రంగా వెంటాడుతోన్న భయం ఇది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూసేవాళ్లం. కానీ గత కొంత కాలంగా చిన్నా పెద్దా అనే వయసు తేడా లేకుండా.. అటాక్ చేస్తోంది. అప్పటిదాకా.. ఆడుతూ.. పాడుతూ.. నవ్వుతూ.. నడుస్తూ.. ఉంటారు.. సడెన్‌గా కుప్పకూలిపోయి ప్రాణాలు విడుస్తున్నారు. ఇటీవల వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పదుల సంఖ్యలో చోటుచేసుకున్నాయి. తాజాగా ట్రావెల్స్‌ కారు డ్రైవింగ్‌ చేస్తూనే గుండెపోటుతో వ్యక్తి ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగింది.

పోలీసులు తెలిపిన ప్రకారం… బడంగ్‌పేట్‌కు చెందిన 41 ఏళ్ల ధనుంజయ్‌ ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో డ్రైవర్‌‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య నందినిజై, కుమార్తె ఝాన్సీ(10), తనయుడు సుదాన్ష్‌(8) ఉన్నారు. ఉదయమే ట్రావెల్స్‌కు వచ్చిన ధనుంజయ్‌ ఓనర్ కారు తీసుకొని పాతబస్తీ లాల్‌దర్వాజా ఏరియాలో ఓ క్లైంట్‌ను పికప్‌ చేసుకునేందుకు బయలుదేరాడు. నల్లవాగు సమీపంలోని ధోబీఘాట్‌ వద్ద కందికల్‌ ఆర్వోబీ ఎక్కే ముందే ధనుంజయ్‌‌కు హార్ట్ అటాక్ వచ్చింది. ఆ సమయంలో కారు తక్కువ వేగంతో ఉండటంతో.. అదుపు చేసేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అది పక్కనే డివైడర్‌పైకి ఎక్కి ఆగిపోయింది. ఆయన సీటులోనే ప్రాణాలు విడిచాడు. హుశారుగా ఇంటి నుంచి వెళ్లిన ధనుంజయ్‌.. ఇలా అకస్మాత్తుగా చనిపోయాడన్న వార్తతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

ఆకస్మికంగా ఆగిపోతున్న గుండె… అరక్షణంలోనే ముగుస్తున్న ఆయుష్షు…! ఎందుకిలా… కార్డియాక్ అరెస్ట్ ..ఇప్పుడిదే యూనివర్సల్ సబ్జెక్ట్‌ ..దీనిపైనే యావత్ ప్రపంచం ఫోకస్ చేసిందిప్పుడు. ఇక్కడ దోషి కోవిడే అన్నది కొందరు..కాదు స్వయం కృతాపరాదమన్నది మరికొందరు..కానే కాదు..వంశపారపర్యమన్న వాదనా మరోవైపు…ఏది నిజం..ఏది వాస్తవం.. ఏది ఏమైనా గుండెపోటు మరణాలు పెరిగాయన్నది నిజం. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్‌ను ఫాలో అవ్వడం తప్ప మన చేతిలో ఏది లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..