CM Revanth Reddy: స్విగ్గీ బాయ్ కుటుంబానికి రూ.2లక్షల సాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు దగ్గర అయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అన్ని వర్గాల ప్రజలకు దగ్గర అయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం వారం రోజుల్లోనే ఆ కుటుంబానికి సీఎం ఆర్థిక భరోసా అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షల చెక్ ను శనివారం సచివాలయంలో బాధిత కుటుంబానికి అందించారు.
డిసెంబర్ 23న గిగ్ వర్కర్స్‌తో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాలుగు నెలల క్రితం ఫుడ్ డెలివరీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ బాయ్ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేస్తుందని తాను ఎదురు చూశానని, కానీ బీఆరెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకుని ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.2లక్షలు ఆ కుటుంబానికి అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
కేవలం వారం రోజుల్లో అధికారులు ఆ కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. శనివారం బాధిత స్విగ్గీ బాయ్ కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆ కుటుంబానికి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి సాయం చేయడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..