Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సుప్రీంలో టీఎస్ ‘గవర్నర్‌ వర్సెస్‌ సర్కార్‌’ కేసు.. తదుపరి విచారణ ఎప్పుడంటే..?

రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి నోటీసులు వద్దని, బిల్లుల పెండింగ్‌కి కారణాలు తాము తెలుసుకుంటామని సుప్రీంకి వివరణ ఇచ్చారు. అయితే..

Telangana: సుప్రీంలో టీఎస్ ‘గవర్నర్‌ వర్సెస్‌ సర్కార్‌’ కేసు.. తదుపరి విచారణ ఎప్పుడంటే..?
Telangana Governor Vs Telangana Government
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 20, 2023 | 6:20 PM

తెలంగాణ గవర్నర్‌ దగ్గర బిల్లుల పెండింగ్‌ అంశంపై సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చింది. గవర్నర్‌కు నోటీసులు ఇవ్వొద్దని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా న్యాయస్థానాన్ని కోరారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి నోటీసులు వద్దని, బిల్లుల పెండింగ్‌కి కారణాలు తాము తెలుసుకుంటామని సుప్రీంకి వివరణ ఇచ్చారు. అయితే.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. గవర్నర్‌కు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ, తదుపరి విచారణ మార్చి 27కు వాయిదా వేసింది.

అయితే గవర్నర్‌ పని తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టుకు వెళ్లింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాజ్యాంగంలోని 32వ అధికరణం ఆధారంగా సివిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో పాసైన బిల్లులను ఆమోదించకుండా ఆలస్యం చేస్తున్నారని, గడువులోగా వాటిని ఆమోదించేలా ఆదేశించాలని ఆమె తన పిటీషన్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. 10 వరకూ బిల్లులు రాజ్‌భవన్‌ దగ్గర ఉన్నాయని విన్నవించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..