Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Diet: షుగర్ కంట్రోల్ కోసం తినాల్సిన ఆహారాలివే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా..

జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నాపెద్దా బేధం లేకుండా అందరూ ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ లేదా..

Diabetes Diet: షుగర్ కంట్రోల్ కోసం తినాల్సిన ఆహారాలివే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా..
Diabetes Diet
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Mar 20, 2023 | 5:20 PM

ఒకప్పుడు నిర్ణీత వయసు దాటినవారు మాత్రమే డయాబెటీస్, బీపీ, కిడ్నీ సమస్యలు వంటివాటితో బాధపడేవారు. అయితే ప్రస్తుత కాలంలో వచ్చిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్నాపెద్దా బేధం లేకుండా అందరూ ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ లేదా మధుమేహం.. చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సర్వసాధారణ సమస్యగా మారింది. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని కూడా అంటాం. అయితే డాక్టర్లు సూచించిన మందులతో పాటు సరైన ఆహార పద్ధతులను పాటిస్తే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. రక్తంలోని చక్కర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్త పీడనం వంటి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు. అంతేకాక వారు సూచించిన కొన్ని రకాల ఆహారాలను డయాబెటిక్ పేషెంట్లు తమ డైట్‌లో చేర్చుకున్నట్లయితే రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణలో ఉండడంతో పాటు..ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మరి వారు సూచిస్తున్న ఆ ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..

చేపలు: డయాబెటిక్‌తో బాధపడుతున్నవారికి చేపలు చాలా మంచి ఆహారం. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని, పనితీరును మెరుగుపరుస్తాయి. అందుకే వారంలో కనీసం 2 సార్లు అయిన చేపలను తినటానికి ప్రయత్నించండని వైద్యులు సూచిస్తున్నారు.

పప్పు దినుసులు: షుగర్ పేషెంట్ల డైట్‌లో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పప్పు దినుసుల నుంచి లభించే ప్రోటీనులు, మాంసాహారం నుంచి లభించే ప్రోటీనుల కంటే మేలైనవి. ఇంకా పప్పు దినుసులు ప్రోటీన్, ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఈ మూలకాలు రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి.

ఇవి కూడా చదవండి

ధాన్యం: మధుమేహం ఉన్నవారు గోధుమ, రాగి తప్ప వరి అన్నం తినకూడదనేది ఆధారాలు లేని అపోహ మాత్రమే. వరి, గోధుమ, రాగి జొన్నలు, సజ్జలు మొదలైన ధాన్యాలలోనూ 70 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అందుకే ఏ ధాన్యం తినాలన్నది ముఖ్యంకాదు. ఎంత పరిమాణంలో తింటున్నాం అన్నదే ముఖ్యమని గ్రహించి ధాన్యాన్ని కూడా ఆహారంగా తీసుకోవచ్చు.

కూరగాయలు: అన్ని రకాల ఆకుకూరలు, వంకాయ, బెండకాయ, ఉల్లి పాయలు, అరటి పువ్వు, బ్రాసెల్స్‌ మొలకలు, క్యాబేజి, కాలిఫ్లవర్‌ ,పుదీన, బొప్పాయి, కరివే పాకు, బ్రకోలి, దోసకాయ, టర్కిప్‌, ముల్లంగి, బెంగుళూరు వంకాయ, అరటిపువ్వు, ములగకాయ, గోరు చిక్కుడు, కొత్తిమీర, పొట్లకాయ, టమాట , బ్రాడ్‌బీన్స్‌, తెల్ల గుమ్మడి, సొరకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే పలు రకాల పోషకాలు డయాబెటిక్ పేషెంట్ల ఆరోగ్యాన్ని కాపాడడమే కాక వారి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి.

బాదం: అనేక రకాల పోషకాలను ఏకకాలంలో పొందాలంటే.. డ్రైనట్స్‌కి మించిన ఆహారం మరొకటి లేదు.  అయితే వీటిలో బాదం ఇంకా చాలా ముఖ్యమైనవి. వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

ఓట్స్: శరీరంలో చెడు కొవ్వుల స్థాయిలను తగ్గించి, రక్తంలోని చెక్కర స్థాయిని సాధారణ స్థితిలో ఉంచే ఆరోగ్యవంతమైన ఫైబర్ ఓట్స్‌లో పుష్కలంగా ఉంటుంది. ప్లెయిన్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ ఎక్కువ చక్కెరలను కలిగి ఉండకుండా, నెమ్మదిగా జీర్ణం అవుతాయి.

బెర్రీస్: బెర్రీస్ తక్కువగా కార్బోహైడ్రేట్స్‌ను కలిగి ఉండటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచివి. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలో ఎలాంటి మార్పులు ఎదురవ్వవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..