AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెలలోనే.. రెడీగా ఉండండి..

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెలలోనే సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందించింది. వరంగల్‌లో వీటిని రైతులకు పంపిణీ చేయనుంది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ప్రకటించారు. గత ఎన్నికల్లో రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామన్నారు.

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఈ నెలలోనే.. రెడీగా ఉండండి..
Farmers
Venkatrao Lella
|

Updated on: May 04, 2026 | 9:36 AM

Share

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనుంది. ఈ నెలలోనే వీటిని పంపిణీ చేయనుంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం రైతు వారోత్సవాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమవుతోంది. గత ఎన్నికలకు ముందు వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. డిక్లరేషన్‌లో రైతులకు పలు హామీలు ఇచ్చారు. అక్కడే ఈ నెల 5,6,7వ తేదీలో భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు తెలిపారు.

వరంగల్‌లో భారీ కార్యక్రమం

వరంగల్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలోనే రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందించనున్నారు. వేలాది మంది రైతులకు వీటిని పంపిణీ చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని గాలికి వదిలేసిందని, తాము అధికారంలోకి వచ్చాక తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. ఒకేసారి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు.

ఈ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

తాము అధికారంలోకి వచ్చాక సన్నబియ్యం పండించినవారికి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చామని స్పష్టం చేశారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతీ ఏడాది రూ.12 వేలు ఇస్తున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు తగిన బుద్ది చెబుతారని పొంగులేటి విమర్శించారు. అటు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి పొంగులేటి శుభవార్త అందించారు. ఈ నెలాఖరులోగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

Follow Us