AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pet Animals License: తెలంగాణలో కుక్కలు, జంతువులకు లైసెన్స్.. పెంచుకోవాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

పెంపుడు జంతువులపై కూరత్వాన్ని అరిట్టాలని, కుక్కల పెంపకందారులు, అమ్మకందారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్ అధికారులను ఆదేశించారు.

Pet Animals License: తెలంగాణలో కుక్కలు, జంతువులకు లైసెన్స్.. పెంచుకోవాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!
Pet Animals License
Balaraju Goud
|

Updated on: Jul 03, 2021 | 7:01 PM

Share

Pet Animals License in Telangana: మీ ఇంట్లో పెంపుడు జంతువు ఉందా..? అయితే, దానికి మున్సిపల్ పర్మిషన్ ఉందా..? లేదంటే మీపై చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇక, పెంపుడు జంతువులకు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​(జీహెచ్‌ఎంసీ) పరిధిలో పెంపుడు జంతువులపై కూరత్వాన్ని అరిట్టాలని, కుక్కల పెంపకందారులు, అమ్మకందారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్ అధికారులను ఆదేశించారు.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం‌‌–2017 నిబంధనలకు లోబడి డాగ్​ బ్రీడర్స్ కార్యకలాపాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. బ్రీడింగ్​ ఆక్టివిటీలో ఉన్న వారందరూ చట్టానికి లోబడి వ్యవరించే విధంగా తెలంగాణ స్టేట్​ఎనిమిల్​వెల్ఫేర్ బోర్డు రిజిస్ట్రేషన్ కలిగి ఉండేలా డాగ్​ బ్రీడర్స్​ కు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు మున్సిపల్​ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్​ శనివారం జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేష్​ కుమార్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్​ రంజన్ లకు లేఖలు రాశారు. డాగ్​ బ్రీడింగ్​ ఆక్టివిటీ చేసే వారందరు స్టేట్​ఎనిమల్​వెల్ఫేర్​బోర్డు రిజిస్ట్రేషన్​ చేసుకునే విధంగా వచ్చే నాలుగు వారాల పాటు గడువు కల్పించి రిజిస్ట్రేషన్‌కు వారికి సహకరించాలని సూచించారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ వంటి సోషల మీడియా నెటవర్కింగ్ ద్వారా అధికారిక, అనధికారిక ప్రకటనలతో కుక్క పిల్లల క్రయవిక్రయాలు జరపడం అక్రమమని అర్వింద్ కుమార స్పష్టం చేశారు. అన్‌లైన్ ద్వారా కుక్క పిల్లల క్రయ విక్రయాలకు తెలంగాణ స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఇలాంటి లావాదేవీలు, వ్యాపారాలపై ఐటీ శాఖ నిఘా వేసి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్‌కు సూచించారు. నిబందనలు పాటించని వారి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు.

ఇందుకోసం డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ, డైరెక్టర్​, మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన(సిడిఎంఏ), హైదరాబాద్​, సైబరాబాద్​, రాచకొండ పోలీసు కమిషనర్ల సహకారంతో రిజిస్ట్రేషన్ లేని డాగ్​బ్రీడర్సపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదించాలని కోరారు.

Read Also…  టీకా కోసం తోపులాట…అంత రచ్చ రచ్చ..ఇలాఐతే థర్డ్ వేవ్ కాదు.. ఎన్ని వేవులైన వస్తాయంటూ కామెంట్లు:vaccine centre video.