Covid-19 vaccination: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యా సంస్థల్లో100 శాతం వ్యాక్సినేష‌న్‌కు మార్గదర్శకాలు..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Sep 04, 2021 | 10:03 PM

Educational Institutions: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో

Covid-19 vaccination: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యా సంస్థల్లో100 శాతం వ్యాక్సినేష‌న్‌కు మార్గదర్శకాలు..
Covid 19 Vaccination

Follow us on

Educational Institutions: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో వందశాతం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శనివారం మార్గదర్శకాలను విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందితో పాటు 18 ఏళ్లు పైబడిన విద్యార్థులందరికీ వందశాతం టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. దీనికోసం సెప్టెంబరు పదో తేదీని గడువుగా నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి విద్యాసంస్థలో బోధన, బోధనేతర సిబ్బంది, 18ఏళ్లు పైబడిన విద్యార్థులందరికీ టీకాలు పూర్తయితే వందశాతం వ్యాక్సినేటెడ్‌గా ప్రకటించాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో పేర్కొంది. అలా పూర్తయిన అనంతరం ఆయా సంస్థల్లో ప్రత్యేకంగా బ్యానర్లు ఏర్పాటుచేయాలని.. పలు కార్యక్రమాలను సైతం నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. వందశాతం టీకాల లక్ష్య సాధనకోసం ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్లు స్థానిక పీహెచ్‌సీలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది.

అన్ని విద్యాసంస్థల్లో సెప్టెంబరు పదో తేదీ కల్లా వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. టీకాల ప్రక్రియను ఆయా విద్యాసంస్థల బాధ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నివేదిక పంపాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

Also Read:

AP Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. మృతుల్లో వైసీపీ నేత..

Viral Video: మాస్క్‌ పెట్టుకోలేదని ఫైన్‌ కట్టమంటే.. ఆ డ్రైవర్‌ చేసిన ఘనకార్యం చూడండి.. వీడియో వైరల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu