Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ-చలాన్ల గడువు ఎప్పుటివరకంటే.. పూర్తి వివరాలివే..

తెలంగాణలోని వాహనదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. పెండింగ్ చలాన్లకు 90శాతం వరకు రాయితీ ఇచ్చింది. డిసెంబర్ 26 నుంచి చలాన్ల పేమెంట్‎పై భారీ డిస్కౌంట్ ప్రకటిస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ సర్కార్.

Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ-చలాన్ల గడువు ఎప్పుటివరకంటే.. పూర్తి వివరాలివే..
Telangana E Challans
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 27, 2023 | 8:23 AM

తెలంగాణలోని వాహనదారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. పెండింగ్ చలాన్లకు 90శాతం వరకు రాయితీ ఇచ్చింది. డిసెంబర్ 26 నుంచి చలాన్ల పేమెంట్‎పై భారీ డిస్కౌంట్ ప్రకటిస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ సర్కార్. మంగళవారం నుంచి వాహనదారులు తమ పెండింగ్‌ చలాన్లను భారీ డిస్కౌంట్‌ తో చెల్లించేలా జీవో జారీ చేసింది. దీంతో చాలా మంది తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్లను చెల్లించడానికి సిద్ధమయ్యారు. అయితే, ఆన్ లైన్ వెబ్ సైట్‎లో రేపటి నుంచి పెండింగ్‌ చలానాలు కట్టొచ్చని పేర్కొంటున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ చలాన్‌లపై తగ్గింపును అందిస్తూ తెలంగాణ రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వు (GO) నం. 659ని జారీ చేసింది. ఈసారి ఆర్టీసీపై ట్రాఫిక్ చలాన్లకు 90 శాతం రాయితీ ఇవ్వగా.. టూ వీలర్స్, ఆటోలపై 80 శాతం, కార్లకు, హెవీ వెహికల్స్‌పై 60 శాతం రాయితీ ప్రకటించారు. ఈ డిస్కౌంట్ గడువు జనవరి 10 వరకే ఉండనుంది.

తెలంగాణలో ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పాటించాలని ట్రాఫిక్‌ పోలీసులు పదేపదే చెప్పినా.. వాహనదారులు పట్టించుకోవడవం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓవర్ టెకింగ్, రాంగ్‌ రూట్‌లో వెళ్లడం, మద్యం తాగి వాహనాలు నడపడం, లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్‌ లేకుండా నడపడం తదితర నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు వాహనదారులు. దీంతో ఆయా వాహనాల ఓనర్ల పేరుపై ట్రాఫిక్‌ చలాన్లు పెరిగిపోతున్నాయి. చలాన్లు పడుతున్నా వాటిని కట్టకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‎లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్