CI Durga Rao: పంజాగుట్ట సీఐపై సస్పెన్షన్ వేటు.. ప్రజా భవన్ ర్యాష్ డ్రైవింగ్ ఘటనలో 17 సెక్షన్ల కింద కేసు నమోదు

పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావును వెస్ట్ జోన్ డీసీపీ మంగళవారం సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుర్గారావుపై అభియోగాలు ఉన్నాయి. బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద అత్యంత వేగంతో కారు నడుపుతూ అక్కడి వారిని షకీల్ తనయుడు సోహెల్ ఢీకొట్టారని ఆరోపణలు వచ్చాయి. 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

CI Durga Rao: పంజాగుట్ట సీఐపై సస్పెన్షన్ వేటు.. ప్రజా భవన్ ర్యాష్ డ్రైవింగ్ ఘటనలో 17 సెక్షన్ల కింద కేసు నమోదు
Panjagutta Ci Durga Rao
Follow us

|

Updated on: Dec 26, 2023 | 10:59 PM

పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావును వెస్ట్ జోన్ డీసీపీ మంగళవారం సస్పెండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సోహెల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుర్గారావుపై అభియోగాలు ఉన్నాయి. బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద అత్యంత వేగంతో కారు నడుపుతూ అక్కడి వారిని షకీల్ తనయుడు సోహెల్ ఢీకొట్టారని ఆరోపణలు వచ్చాయి. 17 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రైవింగ్ సీటులో ఉన్న సోహెల్‌కు బదులు డ్రైవర్ పేరును కేసులో చేర్చడంతోపాటు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్‌స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు. ఇప్పటికే దుర్గారావు వ్యవహారంపై వెస్ట్ జోన్ డీసీపీ పూర్తిస్థాయిలో విచారణ జరిపినట్లు తెలుస్తోంది. కాగా, బీపీ డౌన్ కావడంతో ఇప్పటికే దుర్గారావు దవాఖానలో చేరారు.

గతంలో ప్రజా భవన్ మార్గంలో యాక్సిడెంట్‌ తరువాత సోహైల్‌ను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎కు తరలించారు కానిస్టేబుల్స్‌. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పోలీస్ స్టేషన్‎కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో ఏమో కానీ సోహైల్ బదులు షకీల్ పేరును ఎఫ్ఐఆర్‎లో చేర్చారు. షకీల్.. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో పని చేస్తున్నడు. ఇతనిని ఈ కేసులో చేర్చారు పోలీసులు. ఈ వ్యవహారంపైన సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు చేపట్టారు పోలీస్‌ అధికారులు. అలాగే సోహైల్ తో రాత్రి కాల్స్ మాట్లాడిన అతని ఫ్రెండ్స్‌ను కూడా ప్రశ్నించారు.

గతంలోనూ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ పేరుతో స్టిక్కర్‌ ఉన్న కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి వైపు నుంచి మహేంద్రా థార్‌ కారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 వైపు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కేసులోనూ ఛార్జ్‌షీట్‌ కూడా వేశామన్నారు వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌. చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..