Singareni Election: ప్రారంభమైన సింగరేణి ఎన్నికల పోలింగ్.. 144 సెక్షన్ అమలు
23 పోలింగ్ స్టేషన్లు, నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంది. ఇక.. సాయంత్రం ఐదు గంటలకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ముగియనుంది. రాత్రి ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. అర్థరాత్రి 12 గంటల తర్వాత ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఏరియా వారీగా విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత.. మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన సంఘానికి గుర్తింపు హోదా కేటాయిస్తారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. దక్షిణ భారత్‌లోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిన సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించి ఉన్నాయి. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధులకు 650 మంది సిబ్బంది, బందోబస్తుకు 460 మంది పోలీసులను కేటాయించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలోని ఆరు జిల్లాల పరిధిలో 11 ఏరియాల్లో సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాల్లో 14,985 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రామగుండం రీజియన్‌లో 11వేల 819 మంది కార్మికులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాలుగు ఏరియాల్లో 7వేల 476 మంది కార్మికులు ఓటు వేయనున్నారు.
దానికి సంబంధించి.. 23 పోలింగ్ స్టేషన్లు, నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంది. ఇక.. సాయంత్రం ఐదు గంటలకు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ముగియనుంది. రాత్రి ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. అర్థరాత్రి 12 గంటల తర్వాత ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఏరియా వారీగా విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత.. మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన సంఘానికి గుర్తింపు హోదా కేటాయిస్తారు.
ఏడో పర్యాయం జరుగుతున్న సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం INTUC, బీఆర్‌ఎస్ అనుబంధ సంఘం TBGKS, సీపీఐ అనుబంధ కార్మిక సంఘం AITUCతో పాటు మరో పది కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. CITU, BMS, HMS లాంటి జాతీయ సంఘాలు కూడా పోటీలో ఉండి.. ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలోని కోల్ బెల్ట్ ఏరియాలో ఆయా పార్టీలు, గుర్తింపు సంఘాలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. సోమవారంతో ప్రచారం ముగియగా.. చివరి రోజు హేమహేమీ నేతలు సింగరేణి క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా.. ఓటర్లను అకట్టుకోవడానికి అధికార పార్టీ మంత్రులు సింగరేణి కార్మికులకు పలు రకాల వరాలు ప్రకటించి వారివైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
తెలంగాణ ఉద్యమం 2009లో ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత సింగరేణిలో బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అనూహ్యంగా బలపడింది. వరుసగా 2012, 2017 ఎన్నికల్లో గెలుపొందింది. 2017లో ఏకంగా టీజీబీకేఎస్ తొమ్మిది ఏరియాల్లో గెలుపొందగా, ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేవలం మందమర్రి, భూపాలపల్లి ఏరియ్లాలోనే విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ.. ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చింది. కానీ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఒక దశలో పోటీకి టీజీబీకేఎస్ వెనుకంజ వేసింది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఐఎన్‌టీయూసీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది. మెజారిటీ ఏరియాలను కైవసం చేసుకోవాలని, గుర్తింపు సంఘం హోదా కూడా సాధించాలని గురి పెట్టింది. మొత్తంగా.. బొగ్గుబాయిపై ఏ జెండా ఎగరబోతోంది?.. ఎవరి అజెండా గెలుస్తుంది?.. కార్మికులు పట్టం కట్టేదెవరికి?.. అనేది ఇవాళ అర్ధరాత్రి కల్లా తేలనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
