Covid 19: తెలంగాణలో కొత్తగా 8 కరోనా పాజిటివ్ కేసులు..
తాజాగా వచ్చిన జేఎన్1 వేరియంట్ కూడా ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేసింది. అయితే.. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలని సూచించింది. అటు.. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసింది. కొవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించింది.
మొన్నటి వరకు శాంతించిన కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం లభిస్తుందని అనుకుంటున్న తరుణంలో మళ్లీ కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకీ యాక్టివ్ కేసులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో మంగళవారం కొత్తగా ఎనిమిది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 59కి చేరుకుందని ఇక్కడ విడుదల చేసిన కోవిడ్ హెల్త్ బులెటిన్ తెలిపింది. గత 24 గంటల్లో అధికారులు 1,333 పరీక్షలు నిర్వహించగా నలుగురు వ్యక్తులు కోలుకున్నారు. మంగళవారం నమోదైన ఎనిమిది కొత్త కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు హైదరాబాద్‌కు చెందినవే.
రోగుల నుండి 30 నమూనాల కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అధికారులను జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు ఇస్తున్నాయి.
తాజాగా వచ్చిన జేఎన్1 వేరియంట్ కూడా ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేసింది. అయితే.. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలని సూచించింది. అటు.. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసింది. కొవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..