Israel Embassy: దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ కలకలం.. ఇజ్రాయెల్ ఎంబసీ వెనుక పేలుడు
అగ్నిమాపక, ఇతర భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం హై సెక్యూరిటీ జోన్‌లో ఉంది. రాయబార కార్యాలయానికి సంబంధించిన పరిసర ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.. అయితే సరిగ్గా ఏమి జరిగిందో ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ, హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుండి ఎంబసీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఢిల్లీ లోని ఇజ్రాయెల్ ఎంబసీ కార్యాలయం దగ్గర పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఎంబసీ వెనుక ఖాళీ ప్రాంతంలో పేలుడు శబ్ధం విన్పించింది. వెంటనే అప్రమత్తమైన ఎంబసీ సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు. రాజధానిలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక పేలుడు సంభవించిందని మంగళవారం అగ్నిమాపక దళ విభాగానికి ఒక వ్యక్తి ఫోన్ చేయడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ దర్యాప్తు ప్రారంభించింది. పేలుడు ప్రదేశాన్ని పరిశీలించారు పోలీసులు. అక్కడికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు వ్లెలడించారు.
ప్రస్తుతం పేలుడు జరిగినట్టుగా వచ్చిన ఫోన్ కాల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు అధికారులు. కాల్ చేసింది ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేశారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంటోందని సమాచారం. దీంతో పాటు సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా మరింత అలర్ట్ అయ్యాయి. అగ్నిమాపక, ఇతర భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం హై సెక్యూరిటీ జోన్‌లో ఉంది. రాయబార కార్యాలయానికి సంబంధించిన పరిసర ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు. ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.. అయితే సరిగ్గా ఏమి జరిగిందో ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. ఏది ఏమైనప్పటికీ, హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుండి ఎంబసీ చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
Delhi Fire Service received a call of a blast near the Israel Embassy in the Chanakyapuri area this evening.
“So far nothing has been found at the location,” says Atul Garg, Director, Delhi Fire Services pic.twitter.com/Ipd23kciBS
— ANI (@ANI) December 26, 2023
ఇదిలా ఉంటే, రెండేళ్ల క్రితం కూడా ఇదే ప్రాంతంలో పేలుడు జరిగింది. జనవరి 29, 2021 సాయంత్రం ఢిల్లీలోని ఎంబసీ సమీపంలో పేలుడు సంభవించింది. బాంబు పేలుడుతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ పేలుడు ధాటికి చాలా కార్లు దెబ్బతిన్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..