AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎముకలు కొరికే చలిలో కుక్కపిల్లల అవస్థలు.. ఓ వ్యక్తి ఏం చేశాడో వీడియోలో చూడండి…

న్ని వీడియోలు మనసులను హత్తుకునేవిగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉందనే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కుక్కపిల్లలు గడ్డకట్టే చలిలో వేడి మంట వద్ద సెగ కాపుకుంటున్నాయి. చలికి వణుకుతున్న కుక్కపిల్లలను చూసిన ఓ దయగల వ్యక్తి వాటికి కోసం చలిమంటను ఏర్పాటు చేశాడు..దాంతో ఆ కుక్కపిల్లలు మంటల దగ్గర కూర్చుని హాయిగా చలి కాపుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎముకలు కొరికే చలిలో కుక్కపిల్లల అవస్థలు.. ఓ వ్యక్తి ఏం చేశాడో వీడియోలో చూడండి...
Dogs Managing Winter
Jyothi Gadda
|

Updated on: Dec 26, 2023 | 8:28 PM

Share

సోషల్ మీడియాలో, జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఫన్నీ, ప్రత్యేకమైన వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలో కనిపించే వీడియోలు కొన్ని షాకింగ్‌గా ఉంటే, చాలా వీడియోలు ఎమోషనల్‌గా ఉన్నాయి. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. కొన్ని వీడియోలు మనసులను హత్తుకునేవిగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉందనే అనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కుక్కపిల్లలు గడ్డకట్టే చలిలో వేడి మంట వద్ద సెగ కాపుకుంటున్నాయి. చలికి వణుకుతున్న కుక్కపిల్లలను చూసిన ఓ దయగల వ్యక్తి వాటికి కోసం చలిమంటను ఏర్పాటు చేశాడు..దాంతో ఆ కుక్కపిల్లలు మంటల దగ్గర కూర్చుని హాయిగా చలి కాపుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

డిసెంబర్‌లో ఉత్తర భారతదేశంలో చలితో అందరూ వణికిపోతుంటే.. వీధుల్లో తిరిగే జంతువుల పరిస్థితి మరీ దారుణం. చలికి వణుకుతున్న కొన్ని కుక్కపిల్లలను చూసి చలించిపోయిన ఓ మనిషి వాటి కోసం చలి మంటను ఏర్పాటు చేశాడు.. దాంతో ఆ కుక్క పిల్లలన్నీ ఒక్క చోట చేరి చలి కాచుకుంటున్నాయి. విపరీతమైన చలి ఉన్న ఈ సమయంలో ప్రజలు ఇంటి లోపల కాయిల్స్ మరియు హీటర్లతో తమను తాము వెచ్చగా మార్చుకుంటున్నారు. ఇలాంటి టైమ్‌లో వీధిలో నివసించే జంతువులు మాత్రం చలితో వణికిపోతుంటాయి…అలాంటి మూగ జీవాల కోసం సహాయం చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే… చలిని తట్టుకోలేక చాలాసార్లు కొన్ని నోరులేని జంతువులు చనిపోవడం కూడా చూస్తుంటాం. విపరీతమైన ఎండాకాలంలో దాహంతో, ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉండే ఈ భూమి మీద మన తోటి నివాసులు, జంతువులు, తమను తాము రక్షించుకోలేవు.. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది స్పందించారు. వీడియోపై తమ అభిప్రాయాలు, సూచనలు చేస్తున్నారు. మనం రోడ్ల మీద, ఇంటి దగ్గర చూసే వీధి కుక్కల పట్ల ప్రతి ఒక్కరు కాస్త కరుణ చూపించటం అవసరం. దయచేసి వాటిని మీ ప్రాంగణంలోకి రానివ్వండి.. వాటికి కాస్త ఆహారం, ఆశ్రయం కల్పించండి.. రాత్రిపూట చలిలో అవి రోడ్ల వెంట ఉండలేక ఇంటి ఆవరణ, కార్లు, బైకులకు దగ్గరగా వచ్చి పడుకుంటాయి… అది గమనించగలరు. అర్ధరాత్రి తర్వాత ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. కుక్కల కోసం అవి నిద్రించడానికి చోటు కల్పించడం వాటి కోసం మీరు చేయగలిగిన ఉత్తమమైన పని. అవి పడుకోవడానికి కొన్ని కార్డ్‌బోర్డ్ పెట్టెలు, పాత చాపలు వంటివి వేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..