Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును సొంతం చేసుకున్న దేశం..! గంటకు 605 కి.మీ

భారతదేశంలో వందేభారత్ రైళ్లకు క్రేజ్ విపరీతంగా ఉంది. మన దేశంలోని నగరాలు వందే భారత్ రైళ్ల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. హై-స్పీడ్ వందే భారత్ రైళ్లు గంటకు 180 కి.మీ వేగంతో నడుస్తాయని చెబుతారు. కానీ వాస్తవానికి అవి ఆ వేగంతో నడవవు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తర్వాత ఇప్పుడు భారతదేశం బుల్లెట్ రైలు కోసం ఎదురు చూస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును చైనా ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు గురించి తెలుసుకోవాలంటే..ఈ రైలు గంటకు 200, 300, 500 కాదు.. ఏకంగా..

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును సొంతం చేసుకున్న దేశం..! గంటకు 605 కి.మీ
Fastest Train
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 26, 2023 | 9:12 PM

ప్రపంచంలోని అతిపెద్ద నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే లైన్‌గా భారతీయ రైల్వేలు వరుసగా రెండు సార్లు రికార్డును గెలుచుకుంది. అయితే, జనాభా పెరుగుదల కారణంగా పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యను తీర్చడానికి భారతీయ రైల్వే రాబోయే 4-5 సంవత్సరాల్లో అదనంగా 3,000 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇకపోతే, బుల్లెట్ రైలు భారత్‌కు ఎప్పుడు వస్తుందో వేచిచూడాల్సి వస్తోంది. బుల్లెట్ రైలు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ముంబై-అహ్మదాబాద్ దూరాన్ని కేవలం 127 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఇకపోతే, ప్రపంచంలో గంటకు 600 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు ఉందని మీకు తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు

ట్రాక్‌లపై నడుస్తున్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు వేగం ఫోటో తీయడం కూడా చాలా కష్టతరం. దాని బోగీలను లెక్కించడం కూడా కష్టమే. ప్రపంచంలో బుల్లెట్ రైళ్ల సగటు వేగం గంటకు 300 కి.మీ కాగా, ఈ బుల్లెట్ రైలు గంటకు 605 కి.మీ. చైనాలో నడుస్తున్న ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైలు పేరు మాగ్లెవ్.

ఇవి కూడా చదవండి

ప్రత్యేక బుల్లెట్ రైలు ..

ఈ రైలు సాధారణ వేగం 300 kmph, గరిష్ట వేగం 605 kmph. మాగ్లెవ్ టెక్నాలజీ మొదట జర్మనీకి చెందినది అయితే, దానిని చైనా స్వీకరించింది. చైనా రైలు తయారీ సంస్థ CRRC బుల్లెట్ రైలు అధిక వేగాన్ని విజయవంతంగా పరీక్షించింది. చైనా కొత్త మాగ్లెవ్ కంటే ముందు ఫ్రాన్స్‌కు చెందిన యూరోడుప్లెక్స్ TGV ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 574.8 కిలోమీటర్లు.

రైలు అతివేగం వెనుక ప్రత్యేకం ఏమిటంటే..

మాగ్లెవ్ రైలు సాంకేతికత ఇతర బుల్లెట్ రైళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. రైలు మాగ్నెటిక్ లెవిటేషన్ సిస్టమ్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది రైలు, పట్టాల మధ్య ఒక విధమైన బలమైన అయస్కాంత శక్తిని కలిగి ఉంటుంది. ఇది రైలు వేగానికి సహాయపడుతుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..