రైల్లో సీటు దొరకలేదని ఉయ్యాల కట్టుకున్నాడు.. కట్‌ చేస్తే.. ఏం జరిగిందో తెలుసా..?

రైలులో సీటు దొరకని ఒక ప్రయాణికుడు కోచ్ పైభాగంలో రెండు వైపులా దుప్పటి కట్టుకుని పడుకోవాలని ప్లాన్ చేస్తాడు. వీడియో చూస్తుంటే.. ఆ రైళ్లో చాలా మంది ప్రయాణికులతో కంపార్ట్‌ మెంట్‌ నిండిపోయి ఉంది. దాంతో సీటు దొరకని ప్రయాణికుడు భలే ప్లాన్‌ చేశాడు.. కోచ్ పైభాగంలో దుప్పటితో ఊయలగా కట్టుకున్నాడు.. ఇది చూసిన ఇతర ప్రయాణికులు ఆశ్చర్యపోయారు..తొలుత అతడు ఏం చేస్తున్నాడో తెలియక అందరూ అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు..

రైల్లో సీటు దొరకలేదని ఉయ్యాల కట్టుకున్నాడు.. కట్‌ చేస్తే.. ఏం జరిగిందో తెలుసా..?
Train
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 26, 2023 | 7:49 PM

నేటి ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవితాలతో ముడిపడి ఉంది. ఇంటర్నెట్ ఒక ప్రత్యేక ప్రపంచంలా పనిచేస్తుంది. ఇక్కడ మనం చాలా విభిన్న విషయాల గురించి తెలుసుకుంటాం. ఇక్కడ షేర్ చేయబడిన విషయాలు, ఫోటోలు, వీడియోలు మనకు అనేక సందేశాలను అందిస్తాయి. ఇది ఉపయోగకరమైన సమాచారంతో పాటు వినోద మార్గం కూడా. ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన వీడియోలు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే టెన్షన్‌ల నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి సహాయపడతాయి. ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అయ్యే వాటిల్లో ముఖ్యంగా జంతువులకు సంబంధించినవి ఎక్కువగా నెటిజన్లను ఆకట్టుకుంటాయి. అలాగే, మనుషులు చేసే రీల్స్‌, స్టంట్లు కూడా నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అలాగే, జుగాఢ్‌ వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా హల్‌చల్‌ చేస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా…

భారతదేశం అధిక జనాభా కలిగిన దేశం. రోడ్లు, రైళ్లు, బస్సులు అంటూ ఎక్కడ చూసినా జనం గుంపులు గుంపులుగా కనిపిస్తారు. ప్రజా రవాణాలో రైళ్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రద్దీగా ఉండే మార్గాల్లో, సెలవు దినాల్లో రైలు టిక్కెట్లు దొరకటం కూడా అంత ఈజీ కాదు.. రైళ్లలో జనరల్‌ కోచ్‌లలో ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఇక ఆ సమయాల్లో సీట్ల కోసం కొట్లాడుకునే దృశ్యాలు ఎన్నో చూశాం. జనరల్ కంపార్ట్‌మెంట్లలో సీట్లు పొందిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సీటు దొరకని వారు కూర్చోవడానికి చిన్న స్థలం కోసం ప్రయత్నిస్తారు. అది కూడా రాత్రి ప్రయాణమైతే ఆ కష్టాలు మరింత ఎక్కువ. నిద్రమత్తులో ప్రయాణం చేయడం అసాధ్యం. రద్దీగా ఉండే రైలులో సీటు దొరక్కపోయినప్పటికీ హాయిగా నిద్రపోయేందుకు ఓ ప్రయాణికుడు చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసి యూజర్లు నవ్వుతూ ఆనందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

రైలులో సీటు దొరకని ఒక ప్రయాణికుడు కోచ్ పైభాగంలో రెండు వైపులా దుప్పటి కట్టుకుని పడుకోవాలని ప్లాన్ చేస్తాడు. వీడియో చూస్తుంటే.. ఆ రైళ్లో చాలా మంది ప్రయాణికులతో కంపార్ట్‌ మెంట్‌ నిండిపోయి ఉంది. దాంతో సీటు దొరకని ప్రయాణికుడు భలే ప్లాన్‌ చేశాడు.. కోచ్ పైభాగంలో దుప్పటితో ఊయలగా కట్టుకున్నాడు.. ఇది చూసిన ఇతర ప్రయాణికులు ఆశ్చర్యపోయారు..తొలుత అతడు ఏం చేస్తున్నాడో తెలియక అందరూ అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.. కానీ, అతడు ఎవరి మాట వినలేదు.. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరూ ఊహించి ఉండరు.

ఇక, దుప్పటితో కట్టిన ఊయలపై పడుకునేందుకు అతడు.. తన బూట్లను విప్పి ఫ్యాన్‌పై పెట్టాడు. ఆ తర్వాత క్లాత్ స్వింగ్‌పై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తాడు. కానీ ఆ దుప్పటి అతని బరువును తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా ముడి ఊడిపోయింది.. పెద్ద శబ్ధంతో అతడు కిందపడిపోయాడు.. దీంతో అతని నడుముకు దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియో @ChapraZila ఖాతా ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో భాగస్వామ్యం చేయబడింది . దీనికి విపరీతమైన వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..