Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పారాచూట్ లేకుండా 10వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన స్కైడైవర్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కేసును విచారించిన పోలీసులు.. ఈ ఘటనలో ఎలాంటి కుట్ర జరగలేదని తేల్చారు.. ఇది ఆత్మహత్య కేసు కూడా కాదని నిర్ధారించారు.. ఇది ప్రమాదవశాత్తు మరణమని ప్రకటించారు. అతను పారాచూట్ లేకుండా విమానం నుండి దూకాడని ఎవరికీ తెలియదు. తెలిసి ఉంటే వారిని ఆపేవారని అన్నారు. ఇవాన్ కెమెరా సామాగ్రిని పట్టుకుని, పారాచూట్‌గా భావించి విమానం నుండి దూకినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రెండింటీ బరువు దాదాపు సమానంగా ఉంది. ఈ సంఘటనను ఇప్పటి వరకు ఎవరూ మర్చిపోలేక పోతున్నారట.

పారాచూట్ లేకుండా 10వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన స్కైడైవర్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Skydiver Forget Parachute
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 26, 2023 | 5:04 PM

10వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం నుండి దూకిన వ్యక్తి.. అదంతా కెమెరాలో రికార్డ్‌ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడు.. అతను ఏవరో సామాన్య వ్యక్తి కాదు. వృత్తిరీత్యా అతడు స్కైడైవర్‌. అందుకే అతను భూమి నుండి 10,000 అడుగుల ఎత్తులో విమానంలో ఎగురుతుండగా.. కిందకు దూకేయాలని ముందుగానే ప్లాన్‌ చేసుకున్నాడు..అదంతా కెమెరాలో రికార్డ్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆ రోజు అది అతనికి మూడవ జంప్. కానీ, దురదృష్టవశాత్తు అతడు అనుకున్నది ఒకటైతే.. అక్కడ మరోకటి జరిగింది.. ఎవరూ ఊహించని విధంగా జరిగింది.. ఏం జరిగిందో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. నిజంగా చెప్పాలంటే.. 35 ఏళ్ల ఆ స్కైడైవర్‌ తన మరణాన్ని కెమెరాలో రికార్డ్ చేశాడని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఘటనపై ఇంటర్నెట్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…

అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఫ్రాంక్లిన్ కౌంటీ స్పోర్ట్స్ పారాచూట్ సెంటర్‌ అది.. ఇవాన్ మెక్‌గ్యురే అని స్కైడైవర్‌ విమానం నుండి దూకేందుకు సిద్దంగా ఉన్నాడు. విమానం గాల్లోకి లేచింది..అలా 10వేల అడుగుల ఎత్తుకు విమానం చేరగానే.. అతను విమానంలోంచి దూకేసి స్కైడైవ్‌ చేశాడు.. కానీ పాపం.. అతను విమానం నుండి దూకుతున్నప్పుడు అత్యంత ముఖ్యమైన పారాచూట్ తీసుకోవడం మర్చిపోయాడు. అతను ఎప్పుడూ ఊహించలేదు.. తన మరణాన్ని కెమెరాలో రికార్డు చేశాడు. ఈ మరణం చాలా బాధాకరం అంటూ అందరూ అతని మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. 35 ఏళ్ల ఇవాన్ విమానం నుంచి దూకిన తర్వాత పారాచూట్ తీయడం మర్చిపోయినట్లు గుర్తొచ్చింది. ఆ సమయంలో అతను ప్రతిదీ కెమెరాలో రికార్డ్ చేశాడు. ఈ ప్రమాదానికి ముందు, ఇవాన్ 800 సార్లు విజయవంతంగా స్కైడైవ్ చేశాడు. ఈ సారి కూడా అతడు పారాచూట్ తీసుకొచ్చానని అనుకున్నాడు. కానీ, దురదృష్టవశాత్తు అతడు పారాచూట్‌ లేకుండానే దూకేశాడు.. అతను భూమికి దగ్గరగా వచ్చినప్పుడు, అతని నోటి నుండి వచ్చిన చివరి మాటలు కెమెరాలో రికార్డయ్యాయి.. అతని మృతదేహం అతను బయలుదేరిన ఎయిర్‌ఫీల్డ్ నుండి ఒకటిన్నర మైళ్ల దూరంలో ఉన్న అడవుల్లో లభించింది. ఆ తర్వాత కేసు విచారణ మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన ఏప్రిల్ 1988లో జరిగింది. నిబంధనల మేరకు… పైలట్ పారాచూట్‌ని తనిఖీ చేసే వరకు ఎవరూ విమానం నుండి దూకకూడదనే నియమం ఉంది. కానీ, మెక్‌గ్యూరే పారాచూట్ లేకుండానే విమానం నుంచి దూకిన సంగతి ఎవరికీ తెలియదని పారాచూట్ సెంటర్ యజమాని భార్య నాన్సీ ఫెయార్డ్ చెబుతోంది. అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టగా.. ఎలాంటి కుట్ర జరగలేదని, ఆత్మహత్య కాదని తేలింది. చివరకు అది ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా ప్రకటించారు నిర్వాహకులు. 35 ఏళ్ల ఇవాన్ ఇప్పటికే 800 సార్లు విజయవంతంగా స్కైడైవ్ చేశాడని చెబుతున్నారు. దూకడానికి ముందు అతను తన వద్ద పారాచూట్‌ ఉందనే బావనతోనే కిందకు దూకినట్లు చెబుతున్నారు. కాని వాస్తవానికి అతను పారాచూట్ తీసుకోవడం మర్చిపోయాడని తేల్చారు. అతను పారాచూట్ లేకుండా విమానం నుండి దూకాడని ఎవరికీ తెలియదు. తెలిసి ఉంటే వారిని ఆపేవారని అన్నారు.

కేసును విచారించిన పోలీసులు.. ఈ ఘటనలో ఎలాంటి కుట్ర జరగలేదని తేల్చారు.. ఇది ఆత్మహత్య కేసు కూడా కాదని నిర్ధారించారు.. ఇది ప్రమాదవశాత్తు మరణమని ప్రకటించారు. ఇవాన్ కెమెరా సామాగ్రిని పట్టుకుని, పారాచూట్‌గా భావించి విమానం నుండి దూకినట్లు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రెండింటీ బరువు దాదాపు సమానంగా ఉంది. ఈ సంఘటనను ఇప్పటి వరకు ఎవరూ మర్చిపోలేక పోతున్నారట.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..