జైలు వద్ద కాపలా కాస్తున్న హంసలు.. ప్రతి ఖైదీపై పటిష్ట నిఘా..! ఎక్కడంటే..
అంతేకాదు.. ఇక్కడ ఎలక్ట్రానిక్ నిఘా ఉంది. వ్యక్తిగత నిఘా కూడా ఉంది. అయినప్పటికీ కాపలాగా కుక్కలకు బదులు పెద్దబాతులను సెక్యూరిటీగా ఏర్పాటు చేసినట్టుగా జైలు డైరెక్టర్ వెల్లడించారు. రాత్రి సమయంలో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు చూడగలిగినట్లయితే పగటిపూట కూడా జైలు పరిసరాలు చాలా నిశ్శబ్ద ప్రదేశం. అటువంటి పరిస్థితిలో ఈ స్వాన్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని వారు బలంగా విశ్వసిస్తున్నారు.
నేటి ఆధునిక కాలంలో సాంకేతికత శర వేగంగా విస్తరిస్తోంది. కంప్యూటర్, టెక్నాలజీ సాయంతో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా మనుషుల అవసరం లేకుండానే చాలా పనులు పూర్తవతున్నాయి. చివరకు జైళ్లలో కూడా గార్డులకు బదులు కెమెరాల ద్వారానే నిఘా ఎర్పాటు చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ జైలు వద్ద ప్రత్యేక గార్డులను నియమించారు. ఆ స్పెషల్ గార్డ్స్ జైలు వద్ద నిరంతరం గస్తీ తిరుగుతుండగా విషయంలో వెలుగులోకి వచ్చింది. బ్రెజిల్‌లోని అనేక జైళ్ల వద్ద పక్షలు కాపలాదారులుగా పనిచేస్తున్నాయి. ఏంటి ఇది చదివిన తర్వాత షాక్ అవుతున్నారు కదా..? నమ్మలేకపోతున్నారు కదూ..! కానీ, ఇది నిజమేనండోయ్…పూర్తి వివరాల్లోకి వెళితే…
బ్రెజిల్‌లోని అనేక జైళ్లలో గార్డుల స్థానంలో హంసలు డ్యూటీ చేస్తున్నాయి. అదేంటి హంసలు జైళ్ల వద్ద ఎలా కాపలాగా ఉంటాయని ఆశ్చర్యపోతున్నారు చాలా మంది. కానీ, ఈ పక్షులు కాపలాదారులుగా కీలకంగా వ్యవహరిస్తున్నాయని, గట్టి బందోబస్తును ఇస్తున్నాయని జైళ్ల నిర్వాహకులు విశ్వసిస్తూ చెబుతున్నారు. హంసలకు వినికిడి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుందట. అవి ఏ చిన్న శబ్ధం వచ్చినా సరే.. వెంటనే అవి పెద్ద శబ్దం చేయడం ద్వారా చుట్టుపక్కల అందరినీ హెచ్చరిస్తుంటాయిన చెబుతున్నారు. అంతేకాదు.. ఇక్కడ ఎలక్ట్రానిక్ నిఘా ఉంది. వ్యక్తిగత నిఘా కూడా ఉంది. అయినప్పటికీ కాపలాగా కుక్కలకు బదులు పెద్దబాతులను సెక్యూరిటీగా ఏర్పాటు చేసినట్టుగా జైలు డైరెక్టర్ మార్కోస్ రాబర్టో డి సౌజా వెల్లడించారు. రాత్రి సమయంలో చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. మీరు చూడగలిగినట్లయితే పగటిపూట కూడా జైలు చాలా నిశ్శబ్ద ప్రదేశం. అటువంటి పరిస్థితిలో ఈ స్వాన్స్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని వారు బలంగా విశ్వసిస్తున్నారు.
జైలు అంతర్గత ఫెన్సింగ్, దాని మెయిన్ గేట్, చుట్టూ ప్రహారి గోడల చుట్టూత ఈ హంసలు కాపలాగా తిరుగుతుంటాయి. ఖైదీలు తప్పించుకోకుండా నిరోధించడానికి బ్రెజిలియన్ జైళ్లు హంసలపై ఆధారపడి పనిచేస్తాయి.. ఆసక్తికరంగా ఈ పెద్దబాతులు చైనా సరిహద్దు గస్తీలోనూ రెండేళ్లుగా అక్రమ వలసదారులను ప్రవేశించకుండా ఉంచడంలో కూడా సహాయపడుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..