Viral: 101 క్వింటాళ్ల 11 రకాల ధాన్యాలతో రూపొందించిన సీతారాముల 120 అడుగుల చిత్తరవు
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి గడువు సమీపిస్తున్నది. జనవరి 22న మహాద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతోంది. అయోధ్యలో ఆలయంలో రాముడు కొలువుదీరబోతున్నాడు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. భవ్య రామమందిరానికి ఇప్పటికే నగిషీలు చెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రామ భక్తులు వివిధ రకాలుగా తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో నేపాల్‌లో రామభక్తులు వేసిన చిత్రపటం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి గడువు సమీపిస్తున్నది. జనవరి 22న మహాద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతోంది. అయోధ్యలో ఆలయంలో రాముడు కొలువుదీరబోతున్నాడు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. భవ్య రామమందిరానికి ఇప్పటికే నగిషీలు చెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా రామ భక్తులు వివిధ రకాలుగా తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో నేపాల్‌లో రామభక్తులు వేసిన చిత్రపటం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సీతమ్మ తల్లి జన్మభూమిగా భావించే నేపాల్‌లోని జనక్‌పూర్‌లో కేవలం ధాన్యాలతోనే రూపొందించిన భారీ చిత్తరువు ప్రపంచ రికార్డు నెలకొల్పేలా ఉంది. 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాముడు, సీత చిత్రపటాన్ని రూపొందించారు. త్రేతా యుగంలో జరిగిన వివాహ వేడుకను గుర్తు చేస్తూ, మొత్తం 10 మంది కళాకారులు ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. నేపాల్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఎనిమిది మంది కళాకారులు కలిసి రంగభూమి మైదానంలో సీతారాముల చిత్తరువును రూపొందించారు.
120 అడుగుల పొడవు, 91.5 అడుగుల వెడల్పు కలిగిన ఈ భారీ చిత్రాన్ని రూపొందించడానికి 101 క్వింటాళ్ల 11 రకాల ధాన్యాలను ఉపయోగించారు. చిత్రపటం నిర్మాణంలో ఎక్కడా కృత్రిమ రంగులు వాడలేదని కళాకారులు తెలిపారు. ఈ అపురూప కళాఖండాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. నేపాల్‌లో మార్గ శుక్ల పంచమి రోజును పురస్కరించుకుని జనక్‌పూర్ ధామ్‌లోని జానకి ఆలయంలో సీతారాముల వివాహ వేడుకను ఏడు రోజుల పాటు జరుపుకుంటారు, నేపాల్, భారత్ నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ సంవత్సరం డిసెంబర్ 17 నుంచి ఆలయంలో భారీ ఎత్తున కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.