TSRTC: ఉచిత బస్సు ప్రయాణంపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక సూచన..

TSRTC: ఉచిత బస్సు ప్రయాణంపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక సూచన..

Anil kumar poka

|

Updated on: Dec 26, 2023 | 7:03 PM

మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు టీఎస్‌ఆర్టీసీ కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చెప్పారు. అందుకే తక్కువ దూరం ప్రయాణించే వారు ప‌ల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరారు.

మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు టీఎస్‌ఆర్టీసీ కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చెప్పారు. అందుకే తక్కువ దూరం ప్రయాణించే వారు ప‌ల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజిల్లో కాకుండా మధ్యలోనే బస్సులు ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. దీంతో ప్రయాణ సమయం పెరిగిపోతుందని అన్నారు. అందుకే ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతారని తెలిపింది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.