Amrit Bharat Express: దేశంలో మరో కొత్త తరహా రైళ్లు.. ఈ నెలాఖరునే.! అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.
భారతీయ రైల్వే ముఖ చిత్రం క్రమంగా మారుతోంది. వేగంతో పాటు సకల సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకువెళుతోంది. ఇందులో భాగంగానే దేశంలో వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ రైల్వేస్‌లో సరికొత్త అధ్యయనానికి తెర తీసిన ఈ రైళ్లకు ప్రజల నుంచి కూడా భారీగా ఆదరణ లభించింది. తాజాగా భారత్‌లో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
భారతీయ రైల్వే ముఖ చిత్రం క్రమంగా మారుతోంది. వేగంతో పాటు సకల సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకువెళుతోంది. ఇందులో భాగంగానే దేశంలో వందే భారత్ రైళ్లను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ రైల్వేస్‌లో సరికొత్త అధ్యయనానికి తెర తీసిన ఈ రైళ్లకు ప్రజల నుంచి కూడా భారీగా ఆదరణ లభించింది. తాజాగా భారత్‌లో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంగా ఇండియన్ రైల్వే ఈ కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. డిసెంబర్ 30వ తేదీన తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రావలసి ఉంది. అయితే, డిసెంబర్ 30న ప్రధాని అయోధ్యలో విమానాశ్రయాన్ని, ఆరు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే అదే రోజు తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. దేశలో మొదట రెండు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమవుతాయని, అందులో ఒకటి అయోధ్య నుంచి ఉంటుందని ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. వీటిలో ఒకటి అయోధ్య నుంచి దర్భంగ మధ్య నడస్తుందని, రెండో ట్రైన్ దక్షిణ భారతదేశంలో నడుస్తుందని తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

