Airport: విమానాశ్రయంలో రూ.5 లకే అల్పాహారం, రూ.10లకే భోజనం.! ఎక్కడంటే.?
సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో 10 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిన్ అందించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరా క్యాంటీన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సామాన్యులు కొనే పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో 10 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే టిఫిన్ అందించాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందిరా క్యాంటీన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఖరీదైన ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా సామాన్యులు, మధ్యతరగతి వారికి ఆహారం అందించాలన్న లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీన్ అమలవుతోంది. తాజాగా ఎయిర్‌పోర్టులోని పార్కింగ్ ప్రదేశంలో 2 క్యాంటీన్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. కాగా బెంగళూరు నగరంలో 175కి పైగా ఇందిరా క్యాంటీన్‌లు ఉన్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇందిరా క్యాంటీన్‌లలో కేవలం 5 రూపాయలకే అల్ఫాహారం, 10 రూపాయలకే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. కాగా, కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో జీవన వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో కప్పు టీ లేదా కాఫీ 200 నుంచి 500 రూపాయలు ధర పలుకుతుంది. భోజనం చేయాలనుకుంటే 1,000 రూపాయలవరకూ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇందిరా క్యాంటీన్లు సామాన్యులు, మధ్య తరగతివారికి ఉపశమనం కలిగించనున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

